ఫోర్బ్స్‌ జాబితాలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మరోసారి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఫోర్బ్స్‌ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత 100 మంది మహిళల జాబితాలో మరోసారి చోటు సాధించారు. ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంత శీలురైన 100 మంది మహిళల్లో ఆరుగురు భారతీయ మహిళలున్నారని ఫోర్బ్స్ తన జాబితాలో ప్రకటించింది. వీరిలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగోసారి ఈ ఘనత సాధించారు. ఈ సారి 36 వ స్థానంలో ఉన్న ఈమె.. గత ఏడాది 37 వ స్థానంలో ఉండగా.. అంతకుముందు.. 2020 లో 41 వ స్థానం లోను, 2019 లో 34 వ స్థానంలోనూ ఉన్నారు. ఫోర్బ్స్ వార్షిక లిస్ట్ లో ఇంకా బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్, షా అండ్ నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్, హెచ్సీ ఎల్
టెక్ చైర్ పర్సన్ రోషిని నాడార్ మల్హోత్రా, సెబీ అధినేత్రి మాధాబి పురి బచ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ సోమా మండల్ ఉన్నారు.

freebies - Nirmala Sitharaman asks states doling out freebies to check  fiscal health of government - Telegraph India

వీరిలో మల్హోత్రా, మజుందార్-షా, ఫల్గుణి నాయర్ గత ఏడాది కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. ఇంకా ఈ జాబితాలో 39 మంది సీఈవోలు, 10 మంది దేశాధినేతలు, 11 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆయా రంగాల్లో వీరు సాధించిన కృషిని ఫోర్బ్స్ వివరించింది. రాజకీయ, కార్పొరేట్, మీడియా వంటి రంగాలను దృష్టిలో ఉంచుకుని ఈ లిస్ట్ ను రూపొందించినట్టు తన వెబ్ సైట్ లో పేర్కొంది.