తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమలలో లడ్డూల తయారీ కోసం డిసెంబర్ నాటికి రూ.50 కోట్లతో ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ యంత్రాలు వాడుకలోకి వస్తే బూందీ తయారీకి స్టవ్ ల అవసరం ఉండదన్నారు. రోజుకు 6 లక్షల వరకు లడ్డులు తయారు చేసే అవకాశం ఉంటుందన్నారు.
తిరుమల లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో వెంగమాంబ అన్న ప్రసాద భవనం ముందు నిర్మించిన నూతన పరకామణి భవనంలో 5వ తేదీ నుంచి హుండీ కానుకల లెక్కింపులు ప్రారంభమవుతాయన్నారు. 15 రోజుల్లో రూ. 4.50 కోట్లతో జర్మనీ నుంచి ప్రత్యేక యంతాలను తీసుకువస్తామని తెలిపారు. ఈ యంత్రాలు నాణేలను వేరు చేసి లెక్కించడంతోపాటు ప్యాకెట్లుగా మారుస్తాయని వెల్లడించారు.