భారత్ లో 2 వేలకు దిగువగా కొవిడ్ కేసులు

-

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. రోజువారి కేసులు రెండు వేల దిగువకు చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 1997 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,46,06,460కి పెరిగాయి.

ఇప్పటి వరకు మొత్తం 4,40,47,344 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 5,28,754 మంది మహమ్మారి బారిన పడి మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం మరో 30,362 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గురువారం ఉదయం నుంచి ఇప్పటివరకు ఆరుగురు వైరస్‌కు బలవగా, 3908 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరోవైపు కరోనా వ్యాక్సిన్ పంపిణీని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వేగవంతం చేసింది. ఇప్పటికే చాలా మంది కొవిడ్ మొదటి రెండు డోసుల టీకా తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం బూస్టర్ డోస్ టీకా పంపిణీ ముమ్మరం చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ టీకా వేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news