హైదరాబాద్ లోని పబ్స్ పై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాత్రి 10 దాటితే ఎటువంటి సౌండ్ పెట్టరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. తెల్లవారుజామున 6 గంటల వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులరేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉంటుందని చెప్పింది. అలాగే రాత్రిపూట కేవలం లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని స్పష్టం చేసింది.
హైదరాబాద్ నగరంలోని ముగ్గురు కమిషనర్లకు హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేటి విచారణలో నివేదికను సీపీలు కోర్టుకు సమర్పించనున్నారు. మరోవైపు ఎక్సైజ్, జిహెచ్ఎంసి అధికారులు అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఈరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.