పిఎఫ్ఐపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడి

-

పిఎఫ్ఐ ( పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) పై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. గల్ఫ్ లోను వేల సంఖ్యలో పిఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నట్లు గుర్తించారు. విదేశాలలో స్వచ్ఛంద సంస్థ పేరుతో నిధులు వసూలు చేసినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. వచ్చిన ఫండ్స్ ను భారత్ లో ఉన్న పిఎఫ్ఐ కార్యకర్తలకు హవాలా ద్వారా ట్రాన్స్ఫర్ చేసేవారనివారని.. 120 కోట్ల నిధులకు సంబంధించిన కూపీ లాగుతున్నారు ఈడీ అధికారులు.

ప్రపంచవ్యాప్తంగా తేజస్ అనే పేరును పిఎఫ్ఐ నడిపిస్తుందని.. తేజస్ కు వచ్చిన డొనేషన్ అంటూ ఫేక్ రిసిప్ట్ లను చూపించినట్లు గుర్తించారు. అబుదాబిలో ఉన్న దర్బార్ హోటల్ కేంద్రంగా హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. అబ్దుల్ రజాక్ ను ఇప్పటికే ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తేజస్ కు డైరెక్టర్ గా పని చేసిన కేరళ పీఎఫ్ఐ నాయకుడు షఫీక్ ని మూడు రోజుల క్రితం ఈడీ అధికారులు అరెస్టు చేశారు. షఫీక్ ఖతర్ నుండి ఫండ్స్ కలెక్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే నిజామాబాదులో అరెస్టు అయిన కార్యకర్తలని కస్టడీలోకి తీసుకోనున్నారు ఈడీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news