అఖండ, శ్యామ్ సింగరాయ్ తో పాటూ నేడు ఓటిటిలో విడుదలైన సినిమాల లిస్ట్ ఇదే…!

ఇదివరకు థియేటర్ లో విడుదలైన సినిమాలు టీవీలో రావాలంటే చాలా కాలం పట్టేది. కానీ ఇప్పుడు ఓటిటి పుణ్యమా అని సినిమాలు విడుదలైన నెల రోజులకే ఓటిటి లోకి వస్తున్నాయి. మరి కొన్ని సినిమాలు నేరుగా ఓటిటిలోనే విడుదల అవుతున్నాయి. అంతేకాకుండా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ రోజు కూడా కొన్ని సినిమాలు వెబ్ సిరీస్ కు విడుదల కానున్నాయి. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా అఖండ. ఈ సినిమా ఈ రోజు హాట్ స్టార్ లో విడుదలయింది.

నాని హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ చిత్రం ఈరోజు నెట్ ఫ్లిక్స్ లో విడుదలయ్యింది.

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన హేయ్ జ్యుడ్ సినిమాను తెలుగులో డబ్ చేశారు. ఈ సినిమా ఈ రోజు ఆహా లో విడుదలైంది.

ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ లూసర్. ఈ సిరీస్ నేడు జీ -5 లో విడుదలయింది.

ఇక ఈ వీటితో పాటు నెట్ ఫ్లిక్స్ లో ఓజార్క్, ది గిఫ్ట్, సమ్మర్ షూట్, మై ఫాదర్ విలన్ అనే సినిమాలు విడుదలయ్యాయి. అంతే కాకుండా సోని లివ్ లో….. బూతకాలం,బ్యాచిలర్ అనే సినిమాలు విడుదలవుతున్నాయి. అదేవిధంగా హాట్ స్టార్ లో సింగిల్ డ్రంక్ ఫీమేల్, బిలియన్స్ చిత్రాలు విడుదల కానున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో ఎ హీరో, అన్ పాస్డ్ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.