దక్షిణ మధ్య రైల్వేలో కరోనా కలకలం…. ఈ నెల 24 వరకు 55 రైళ్ల రద్దు

-

దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు ఎక్కువ అవుతోంది. మరోవైపు ఓమిక్రాన్ కేసులు కూడా విస్తరిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 3.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కోవిడ్ కేసులు దక్షిణ మధ్య రైల్వేను కూడా కరోనా కలవరపెడుతోంది. ట్రైన్ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది వరసగా కోవిడ్ బారిన పడుతుండటంతో రైల్వే కలవరపడుతోంది. తాజాగా కరోనా కేసులు పెరగుతుండటంతో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 నుంచి 24 వరకు 55 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మొదలైన ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. కాగా కోవిడ్ పరిస్థితిని బట్టి ఉద్యోగులకు ఎంతమందికి కరోనా సోకిందనేదాని బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news