గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు రాకపోతే ఇలా కంప్లైంట్ చెయ్యండి..!

-

ప్రతీ ఏడాది 12 గ్యాస్ సిలిండర్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మనం సిలెండర్ బుక్ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్‌లోకి నేరుగా క్రెడిట్ అవుతుంది. ధరలు ఎక్కువగా వున్నాయి కనుక సబ్సిడీ డబ్బులు వదిలేయడం అంత మంచిది కాదు. అయితే సబ్సిడీ ఎంత వస్తుందన్నది ప్రాంతాన్ని బట్టి మారుతుంది. సబ్సిడీ డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు పలు కారణాల వల్ల సబ్సిడీ కస్టమర్ల అకౌంట్లకు జమ కాదు.

 

Gas.jpg
Gas.jpg

అలాంటపుడు మనం ఫిర్యాదు చెయ్యచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.10 లక్షల పైన ఉన్న ఉన్నవారికి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాదు గమనించండి. సబ్సిడీ రావాలంటే కస్టమర్లు తప్పని సరిగా తమ ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయడం తప్పనిసరి. అలానే బ్యాంక్ అకౌంట్‌ను ఎల్‌పీజీ ఐడీకి కూడా లింక్ చేయాలి.

డబ్బులు పడలేదు అంటే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ బ్యాంక్ అకౌంట్‌లో జమ అయిందో లేదో ఓసారి చెక్ చేయాలి. టోల్ ఫ్రీ నెంబర్ 18002333555 కి కాల్ చేసి కూడా మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. లేదా సబ్సిడీ రాకపోతే http://www.mylpg.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేయచ్చు. మీ సర్వీస్ ప్రొవైడర్ పేరు సెలెక్ట్ చేయాలి. కొత్త యూజర్ అయితే అకౌంట్ రిజిస్టర్ చేయాలి. ముందే అకౌంట్ ఉంటే సైన్ ఇన్ చేయాలి. నెక్స్ట్ సైన్ ఇన్ చేసిన తర్వాత బుకింగ్ హిస్టరీ ఓపెన్ చేసి.. సబ్సిడీ వచ్చిందో లేదో చూడండి. ఒకవేళ సబ్సిడీ రాకపోతే దగ్గర్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లాలి. కస్టమర్ల గ్యాస్ పాస్‌బుక్ వివరాలు ఇచ్చి సబ్సిడీ రాలేదని కంప్లైంట్ చేయాలి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news