టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు : నేడు విచారణ హీరో రానా

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నేడు విచారణ కు హాజరు కానున్నారు హీరో దగ్గుబాటి రానా. ఇవాళ ఉదయం 10.30 గంటల సమయం లో ఈడీ కార్యాలయానికి రానున్నారు హీరో దగ్గుబాటి రానా. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరియు కెల్వీన్‌ కు ఉన్న సంబంధాలపై రానాను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఇక ఇప్పటికే ఇప్పటికే 12 సినీ ప్రముఖు ల్లో నలుగురిని విచారణ చేశారు ఈడీ అధికారులు.

ఇక అటు టాలీవుడు డ్రగ్స్ కేసులో మొట్ట మొదటి సారిగా నోటీసులు అందుకున్నారు హీరో రానా. డ్రగ్స్ వ్యవహారం, మనిలాండరింగ్ వ్యవహారం పై రానాను ప్రశ్నించునున్నారు ఈడీ అధికారులు. నిన్న సుదీర్ఘంగా నటుడు నందు తో పాటు కెల్విన్, ఖుద్దుస్, వాహిద్ లను విచారణ చేశారు ఈడీ అధికారులు. కాగా… ఇప్పటికే ఈ టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు లో పూరీ జగన్నాధ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఛార్మీ మరియు నటుడు నందు ను ఈడీ అధికారులు విచారణ చేసిన సంగతి తెలిసిందే.