ఆంధ్రప్రదేశ్: గణేష్ ఉత్సవాలపై ఆంక్షలపై రాష్ట్రవ్యాప్త ధర్నా… బీజేపీ

వినాయక చవితికి ఇంకా రెండు రోజులే ఉంది. దేశమంతా ఉత్సవాలకు రెడీ అవుతుంది. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించింది. వీధుల్లో వినాయకులు పెట్టి సంబరాలు జరపడానికి ఆంక్షలు విధించింది. కోవిడ్ 19 థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంటూ ప్రభుత్వం తెలిపింది. ఐతే హిందూ పండగల మీద ఆంక్షలు ఎందుకు అంటూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.

గణేష్ ఉత్సవాలను కోవిడ్ నిబంధనల మేరకే జరుపుకుంటాం. స్కూళ్ళకు, కాలేజీలకు లేని కరోనా పండగలకు మాత్రమే ఉందా? కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు నేడు రాష్ట్రవ్యాప్త ధర్నాకు బీజేపీ దిగనుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ధర్నా చేపట్టనున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో సోము వీర్రాజు, టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.