వెబ్ సిరీస్ లకు సై అంటున్న టాప్ డైరక్టర్స్…!

-

డిజిటల్ ప్రపంచంలోకి టాప్ డైరెక్టర్స్ అందరూ అడుగు పెట్టేస్తున్నారు.వెబ్ సిరీస్ లు తెరకెక్కించేస్తున్నారు.కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా ఇదే తంతు .ఐతే మన తెలుగు దర్శకులు ఓటీటీలకు వచ్చి వెబ్ సిరీస్ లు చేయడానికి కాస్త ఫీల్ అవుతున్నారు.ఎందుకలా…. ఓటీటీ రంగంలో బాలీవుడ్ తో పోల్చుకుంటే సౌత్ చాలా వెనకపడి ఉంది.అందుల్లోను కోలీవుడ్ బ్యాచ్ తో పోల్చుకుంటే టాలీవుడ్ అసలు వెబ్ సిరీస్ లే చేయడం లేదని చెప్పాలి.అందరూ మెయిన్ స్ట్రీమ్ మీదనే ఫోకస్ పెడుతున్నారు.

తెలుగులొ వెబ్ సిరీస్ లు చేసేది కూడా అవుట్ డేటెడ్ ఆర్టిస్ట్ లు,,అప్ కమింగ్ వారే కావడంతో అటు జనాలు వీటిపై పెద్దగా ద్రుష్టి పెట్టడం లేదు.అంతగా గుర్తింపుకు నోచుకోని అనీష్ కురువెల్ల లాంటి వారు గాడ్స్ ఆఫ్ ధర్మపురి లాంటి వెబ్ సిరీస్ లతో కాస్త గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో వెబ్ సిరీస్ చేయాలంటే అదేదో తమకు సినిమాలు లేకనే చేస్తున్నామనుకుంటారని తెగ భయపడిపోతున్నారు.అటు ప్రేక్షకుల థింకింగ్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఎందుకొచ్చిన రిస్క్ అనుకుని సైలంట్ కూర్చున్న మ్యాటర్ ఉన్న దర్శకులు ఉన్నారు.

అయితే ఇవన్నీ ఆలోచించకుండా కోలీవుడ్లో చాలామంది యంగ్ డైరెక్టర్లు వెబ్ సిరీస్ లకు డైరెక్షన్లు చేస్తున్నారు. సినిమాలు సినిమాలే ,వెబ్ సిరీస్ లు వెబ్ సిరీస్ లే అన్న చందంగా వారి వ్యవహారం ఉంది.రీసెంట్ గా అమేజాన్ ప్రైమ్ కోసమని “పుతమ్ పుదు కాలై” అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ఈ నెల 16న దీని ప్రిమియర్స్ పడనున్నాయి.గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ సుబ్బరాజ్, రాజీవ్ మీనన్, సుధ కొంగర లాంటి ప్రముఖ దర్శకులతో పాటు సుహాసిని మణిరత్నం దీనికి డైరెక్ట్ చేయడం విశేషం. ఇక ఈ వెబ్ సిరీస్‌లో జయరాం,సుహాసిని, అను హాసన్, శ్రుతి హాసన్, బాబీ సింహా, కళ్యాణి ప్రియదర్శిని, ఆండ్రియా, ఎంఎస్ భాస్కర్ ఊర్వశి లాంటి పేరున్న నోటెడ్ ఆర్టిస్ట్ లు నటించారు.

తమిళంలో ఇంతమంది దర్శకులు కలిసి ఓ వెబ్ సిరీస్ రూపొందిస్తే లేని ఇగో… మన తెలుగు దర్శకులు చేస్తే ఎలా వచ్చేస్తుంది.ఇప్పటికే తరుణ్ భాస్కర్ ,వంశీపైడిపల్లి లాంటి దర్శకులు వెబ్ సిరీస్ లు చేయాలనే ప్లానింగ్ తో ఉన్నారు.అలాగే డైరెక్టర్ క్రిష్ ఆహా వెబ్ సిరీస్ లకు రైటింగ్ సైడ్ హెల్ప్ చేస్తున్నాడు.అయితే వెబ్ సిరీస్ లను హ్యాండిల్ చేయడంలో ఇంకా ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్స్ మనకు ఉన్నప్పటికీ సినిమా పరంగా తమ ఉనికి కాపాడుకునే ప్రయత్నాల్లోనే వారు ఉన్నారు.దీంతో తెలుగు నుంచి మంచి దర్శకులు వెబ్ సిరీస్ లను డైరెక్ట్ చేయడానికి రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news