రూపాయి పుట్టుక బర్త్ డే
రూపాయి లెక్క బడ్జెట్ డే
దేశాన్ని ప్రభావితం చేసే శక్తి మన వంటిల్లుకు ఉంది. ఎలానో చూద్దాం. అమ్మ వంట ఆరోగ్యకరం అయి ఉంటే ఎటువంటి రోగాలూ రావు. అమ్మ వంట భారతీయ సంస్కృతిని నిలబెడితే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. అమ్మ వంట సమయానికి తింటే చాలు రోగాలే రావు. అంటే ఆహారం ఆర్థికాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇక వంటిల్లు నుంచి చేసే పొదుపు దేశ ప్రగతిని నిర్దేశించగలదు. భవిష్య భారాన్ని తగ్గించి భవిష్య భారతావని నిర్మాణానికి సహకరించగలదు. కనుక అంతా అమ్మ చేతిలో ఉంది నిర్మలమ్మ చేతిలో ఉంది.
బడ్జెట్ అంటే టీ కప్పు లోతుఫాను లెక్క. లేదా కాఫీ తోటలో గడిపిన ఒక రోజంత! అంతే అంతకుమించి ఏముందని.ఎకనామిక్స్ ను హాయిగా నవ్వుకుంటూ చదువుకుని తీరడం బడ్జెట్.. ఇంతకు మించి ఏముందని ఇన్ఫిలేషన్ ను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లూయెంజాలు అనేకం వస్తున్నాయి కనుక మనం జాగ్రత్త. మార్కెట్ జాగ్రత్త. చిల్లర ఖర్చుల అదుపు జాగ్రత్త.షాపింగ్ జాగ్రత్త.
ఇంకా మీ ఇంట్లో మీ ఒంట్లో ఆరోగ్యం జాగ్రత్త! ఇలా చెప్పడమే బాధ్యత.ఈ పాటి కూడా చెబుతున్నాయా ప్రభుత్వాలు. మార్కెట్ లో ధరలు పెరిగితే వస్తువు వాడకం తగ్గుందని చాలా కాలం కిందట మాట! ఇప్పుడు క్రేజ్ కు అనుగుణంగా బ్రాండ్ కు అనుగుణంగా ఆ సూత్రం చెల్లదు. వస్తువు మన్నిక ఆధారంగా విలువను పొంది ఉంటుంది కనుక ధర అన్నది పట్టించుకోని స్థితిలో ఇవాళ భారతీయ వినియోగదారులు ఉన్నాయి.
మనోళ్లకు ఇ కామర్స్ పై మంచి పట్టుంది కనుక ఆఫర్లను బాగానే ఫాలో అవుతారు. అందుకు అమెజాన్ సహకరిస్తుంది వంటింటి వరకూ! మాస్టర్ బెడ్ రూమ్ వరకూ ఆహా సహకరిస్తుంది.. ఎంటర్టైన్మెంట్ వరకూ! కనుక తెలుగు వారికి కొత్త అలవాట్లు రావాలి అని అల్లు అరవింద్ ఎలా అయితే పరితపిస్తున్నారో అదేవిధంగా మార్కెట్ కు కొత్త శక్తులు రావాలని కేంద్రం కూడా తప్పించాలి. కొత్త శక్తుల రాకను ఆహ్వానించి వారిని ప్రోత్సహించాలి. కానీ ఇవాళ అప్పుడున్న శక్తులే ఉన్నాయి. వారికి అనుగుణంగానే నిర్ణయాలు ఉన్నాయి అన్న విమర్శ నుంచి కేంద్రం తప్పుకోలేకపోతోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు అనుగుణంగా చాలా మార్పులు వస్తున్నాయి. రానున్నాయి. ఎన్నికల ఖర్చుకు పార్టీలు సిద్ధం అవుతున్నాయి కనుక ఖర్చే లేని పని బడ్జెట్లో పథకాలు ప్రవేశపెట్టడం. వాటితో నార్త్ ఇండియన్ ను సంతృప్తి పెట్టడం.. ఇవి ఇవాళ నిర్మలత్త చెప్పబోయే కబురు కావొచ్చు. లేదా అంతకుమించిన ఆలోచన కూడా కావొచ్చు.
– టాపిక్ ట్రాఫిక్ మన లోకం ప్రత్యేకం