భార‌త్‌లో 147కి చేరిన క‌రోనా బాధితుల సంఖ్య‌..!

-

దేశ వ్యాప్తంగా రోజు రోజుకీ క‌రోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ప‌శ్చిమ బెంగాల్‌లో 1 కరోనా కేసు నిర్దార‌ణ అయింది. ఇంగ్లండ్ నుంచి వ‌చ్చిన ఓ వ్య‌క్తికి క‌రోనా ఉన్న‌ట్లు గుర్తించామ‌ని బెంగాల్ ప్ర‌భుత్వం తెలిపింది. అలాగే ల‌ద్ధాఖ్‌లోని ఓ ఆర్మీ జ‌వానుకు కూడా క‌రోనా ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. ఇక మహారాష్ట్ర‌లో క‌రోనా తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంది. తాజాగా పూణెలో 28 ఏళ్ల ఓ యువ‌తికి క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. ఆమె ఫ్రాన్స్‌, నెద‌ర్లాండ్‌ల నుంచి ఇండియాకు వ‌చ్చిన‌ట్లు నిర్దార‌ణ అయింది. దీంతో ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42కు చేరుకుంది.

total number of corona cases reached to 147 in india

ఇక భార‌త్‌లో బుధ‌వారం నాటికి క‌రోనా కేసుల సంఖ్య 147కు చేరుకుంది. కాగా క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం ముగ్గురు మృతి చెందారు. మ‌రో 14 మందికి క‌రోనా పూర్తిగా న‌య‌మ‌వ‌డంతో వారిని డిశ్చార్చి చేసి ఇండ్ల‌లోనే క్వారంటైన్‌లో ఉంచారు. ఇక క‌రోనా వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. మ‌లేషియా, ఫిలిప్పీన్స్‌, ఆప్గ‌నిస్థాన్‌, ఐరోపా దేశాల నుంచి భార‌త్‌కు వ‌చ్చే ప్ర‌యాణికుల‌పై నిషేధం విధించారు.

కాగా భార‌త్‌లో క‌రోనా వైర‌స్ ఇంకా 2వ ద‌శ‌లోనే ఉంద‌ని ఐసీఎంఆర్ తెలిపింది. సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి ఎప్పటిక‌ప్పుడు శాంపిల్స్‌ను సేక‌రిస్తున్నామ‌ని, ఇక ప్ర‌జలు అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ప్ర‌యాణాలు చేయ‌కూడ‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news