అందంగా ఉంది కదా అని ఆ మొక్కను టచ్‌ చేసింది..ప్రాణాలమీదకొచ్చింది..!

-

ప్రకృతికి అందం చెట్లే..కొన్ని మొక్కలు చూడ్డానికి అందంగా ఉంటాయి.. గులాభీ పూలు బాగున్నాయి కదా అనీ ఇష్టవచ్చినట్లు పట్టుకుంటే..దానికి ఉంటే ముల్లు గుచ్చుకుంటాయి.. ఇలా కొన్ని చెట్లు ప్రమాదకరంగా ఉంటాయి.. ముల్లు తెలుస్తాయి కాబట్టి.. జాగ్రత్తపడతాం.. మరి తెలియని వాటి సంగంతేంటి..? చూసేందుకు యాట్రక్టివ్‌గా ఉందని.. ఓ చిన్నారి చెట్టుని తాకింది.. ప్రస్తుతం ఆ పాప పరిస్థితి విషమంగా ఉంది. చర్మంపై బొబ్బలు వచ్చాయి. గ్రేట్ బ్రిటన్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ చిన్నారి పాఠశాలలో ఆడుకుంటుండగా హాగ్‌వీడ్ చెట్టు కనిపించింది. అయితే చిన్నారి ఈ మొక్కను తాకడంతో.. బాలిక చర్మం కాలిపోయింది. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు.. ఇదే విషయంపై పాఠశాల యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేస్తూ.. స్టూడెంట్ ఈ ప్రమాదకరమైన మొక్కను తాకడంతో చిన్నారి పరిస్థితి విషమించిందని పేర్కొన్నారు. అంతేకాదు ఇటు వంటి మొక్కలు.. మీ చుట్టుపక్కల కనిపిస్తే.. వెంటనే దానిని నిర్ములించండి.. లేదంటే మీ పిల్లలకు హాని కలిగించవచ్చు అంటూ స్కూల్‌ యాజమాన్యం ప్రకటించింది.

ఈ మొక్క ఎందుకు ప్రమాదకరమైనది అంటే

ఈ మొక్కలు వేడి ప్రదేశాలలో చాలా త్వరగా పెరుగుతాయి. ముఖ్యంగా బ్రిటన్‌లో ఉన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు ఉష్ణోగ్రత కారణంగా ఈ ప్రమాదకరమైన మొక్కలు వేగంగా పెరుగుతున్నాయి. భారీ సంఖ్యలో ఎక్కడబడితే అక్కడ పుట్టుకొస్తున్నాయి..దీంతో ఈ మొక్కను తాకి ఎక్కువ మంది ప్రజలు కాలిపోతున్నారు. ఈ మొక్కను తాకేందుకు ఆత్రం చూపిస్తారు. అయితే ఈ మొక్కను తాకిన 48 గంటల్లోనే .. దుష్ప్రభావాలు శరీరంపై కనిపిస్తాయి.
19వ శతాబ్దంలో యురేషియా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చిన ఈ మొక్క ఇప్పుడు ఆదేశంలో భయాందోళనలు సృష్టిస్తోంది. హాగ్‌వీడ్ ఇంత విషపూరితం అవడానికి కారణం.. దాని లోపల ఉన్న సున్నితమైన ఫ్యూరనోకౌమరిన్‌లు. ఇవి మొక్క ప్రమాదకరంగా మారేలా చేస్తాయి. ప్రపంచానికి ప్రమాదకరమైన మొక్కగా హాగ్‌వీడ్ నిలిచింది. ఈ మొక్క వల్ల కలుగుతున్న అనారోగ్యాన్ని నయం చేయడానికి తగిన ఔషధం ఇప్పటి వరకూ కనుక్కోలేదు..కాబట్టి..బయట ఏది పడితే అది టచ్‌ చేయకుండా ఉండటమే అన్ని విధాలా మేలు.. చాలామంది.. ఏదైనా ఇంట్రస్టింగా ఉంటే.. వాటిని టచ్‌ చేయడం, ఫోటోలు దిగడం, వాటిని ఓ వాసన పీల్చేయడం వంటివి చేస్తుంటారు.. ఏది ఎంత ప్రమాదమే అనుభవం అయ్యే వరకూ ఎవరూ గుర్తించలేరు కాబట్టి..జరభద్రం మరీ..!.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news