అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్..ఈ సారైనా హిట్ పడేనా?

-

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన చిత్రాలన్నీ ఇటీవల కాలంలో వరుసగా అనుకున్న స్థాయిలో ఆడటం లేదు. ఇటీవల విడుదలైన ‘పృథ్వీరాజ్’ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణ అంతగా పొందలేకపోయింది. కాగా, అక్షయ్ నటించిన మరో చిత్రం ‘రక్షా బంధన్’ విడుదలకు సిద్ధమవుతోంది.

బాలీవుడ్ సక్సెస్ ఫుల్ అండ్ సెన్సిబుల్ డైరెక్టర్ ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రక్షాబంధన్’ ఈ ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్.

ఈ నెల 21న సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అన్నా చెల్లెళ్ల అనుబంధం గురించి చిత్రంలో చాలా చక్కగా వివరించినట్లు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ గత చిత్రాలు ‘లక్ష్మి’, ‘బెల్ బాటమ్’, ‘బచ్చన్ పాండే’, ‘పృథ్వీరాజ్’..బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టిన నేపథ్యంలో ఈ సారైనా అక్షయ్ కుమార్ హిట్ కొట్టాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news