ఇవాళ, రేపు వై‌సీపీ ప్లీనరీ సమావేశాలు.. గుంటూరులోట్రాఫిక్ ఆంక్షలు

-

ఇవాళ, రేపు వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈ ప్లీనరీ నిర్వహించనున్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ ఆవిర్బావం తరువాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ కూడా ఇదే. అయితే.. వై‌సీపీ ప్లీనరీ సమావేశాలు, బహిరంగ సభ సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్లు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రేపు ఉదయం 10 గంటలకు నుంచి రాత్రి పది గంటల ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.

చెన్నై నుంచి విజయవాడ మీదుగా విశాఖ, ఇబ్రహీంపట్నం, నందిగామ వెళ్లే వాహానాల మళ్లింపు. ఒంగోలు జిల్లా త్రోవగుంట వద్ద నుంచి చీరాల- బాపట్ల – రేపల్లె- అవనిగడ్డ- పామర్రు – గుడివాడ – హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖ, ఇబ్రహీంపట్నంకు డైవర్షన్. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్ళే వాహనాలను బుడంపాడు క్రాస్ రోడ్స్ మీదుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, పెనుమూరి బ్రిడ్జ్ మీదుగా అవనిగడ్డ, పామర్రు – గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖ వైపునకు మళ్లింపు.

 

విశాఖ నుంచి చెన్నై వైపు వెళ్ళే లారీలు, భారీ వాహనాల హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి దారి మళ్లింపు. గుడివాడ–పామర్రు -అవనిగడ్డ– రేపల్లె-బాపట్ల–చీరాల-త్రోవగుంట –ఒంగోలు జిల్లా మీదుగా మళ్ళింపు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్ళే భారీ వాహనావ మళ్లింపు. హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు-మైలవరం– జి కొండూరు, ఇబ్రహీంపట్నం వైపు మళ్ళింపు. హైదరాబాద్ వైపు నుంచి విశాఖ వెళ్ళే వాహనాలను ఇబ్రహీంపట్నం వద్ద నుంచి జి కొండూరు – మైలవరం- నూజివీడు -హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లింపు. చెన్నై వైపు నుండి విశాఖ వైపు వెళ్ళే మల్టీ యాక్సిల్ గూడ్స్ వాహనాలను చిలకలూరి పేట, ఒంగోలు, నెల్లూరు వద్ద నిలిపివేతకు నిర్ణయం. తొమ్మిదో తేదీ రాత్రి 10 గంటల అనంతరం మల్టీ యాక్సిల్ గూడ్స్ కు అనుమతి.విశాఖ వైపు నుంచి చెన్నై వైపు వెళ్ళే మల్టీ యాక్సిల్ గూడ్స్ వాహనాలను హనుమాన్ జంక్షన్ వద్ద పొట్టిపాడు టోల్ గేట్ వద్ద జాతీయ రహదారికి సమీపంలో నిలిపివేత.

ప్లీనరీకి వచ్చే వాహనాల పార్కింగ్ ప్రదేశం వివరాలు:
విజయవాడ నుండి ప్లీనరీకి వచ్చే బస్సులు కొసం కాజా టోల్ ప్లాజా వద్ధ గల ఆర్కే వెనిజుయా లే అవుట్. విజయవాడ నుండి ప్లీనరీకి వచ్చే కార్లు, ఆటోలు, టూ వీలర్లకు నాగార్జున యూనివర్సిటీలో పార్కింగ్ సౌకర్యం. గుంటూరు నుంచి ప్లీనరీకి వచ్చే బస్సులకు నంబూరు, కంతెరు రోడ్డుపై పార్కింగ్. గుంటూరు నుంచి ప్లీనరీకి వచ్చే కార్లు, ఆటోలు, టూ వీలర్లు కోసం కేశవరెడ్డి స్కూల్, అమలోద్భవి హోటల్ & రైన్ ట్రీ అపార్ట్మెంట్స్ పక్కన పార్కింగ్.

Read more RELATED
Recommended to you

Latest news