“సాలుదొర – సెలవుదొర” తరహాలో పాటలు రెడీ చేసిన బీజేపీ..వివరాలు ఇవే

-

“సాలుదొర – సెలవుదొర” తరహాలో పాటలు రెడీ చేసిన బీజేపీ..సాలుదొర – సెలవుదొర ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాటలు కూడా రెడి చేస్తోంది బిజెపి. ఈ మేరకు 31 లిరిక్స్‌ తరహాలో విడుదల చేసింది బీజేపీ పార్టీ. అంతేకాదు… సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది బీజేపీ పార్టీ.

1. ఇంటికో ఉద్యోగమంటివి,
ఇయ్యకుండ గోసపెడ్తివి.
సాలు దొర- సెలవు దొర.

2. ఏడబోయింది నిరుద్యోగ భృతి?
ఎంతకు దిగజార్చినవ్‌ మా నిరుద్యోగుల గతి!?
సాలు దొర- సెలవు దొర.

3. ఉచితంగా ఎరువులు ఇస్తనంటివి,
ఉత్త మాటలు చెప్పి, రైతులను ఉదరగొడ్తవి!
సాలు దొర- సెలవు దొర.

4. దళితుడినే ముఖ్యమంత్రి చేస్తనని,
దగా చేసి గద్దెనెక్కితివి,
అట్నించి నియంతవై మా నెత్తికెక్కితివి!
సాలు దొర- సెలవు దొర.

5. వరి వేస్తే ఉరి అంటివి,
అరిగోసలుపెట్టి రైతులను లాస్‌ చేస్తివి.
సాలు దొర- సెలవు దొర.

6. అత్యాచారాలకు అడ్డు లేదు,
సత్వర చర్యలకు దిక్కు లేదు.
శాంతి భద్రతలను గాలికొదిలేసిన మీ ఏలుబడి
సాలు దొర- సెలవు దొర.
7. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తనని,
అక్షరాల రైతులను మోసం చేస్తిరి.
సాలు దొర- సెలవు దొర.

8. అమరవీరుల త్యాగాలు గుర్తుకున్నయా?
అసెంబ్లీల ఒక్కసారైనా వాళ్లను యాజ్జేసుకున్నరా?
సాలు దొర- సెలవు దొర.

9. పేరుకే ఇరవై నాలుగు గంటల కరెంటు,
ఎవుసం ఎండుతున్నది. రైతు గుండె మండుతున్నది.
సాలు దొర- సెలవు దొర.

10. ప్రగతి భవన్‌ నుండి ఫామౌజుకు, నిత్యం ప్రయాణాలు,
వృథా చేస్తున్నవ్‌ ప్రజాధనం, కోట్ల రూపాయలు.
సాలు దొర- సెలవు దొర.

11. పల్లెల్ని బెల్ట్‌ షాపులకు, పట్నాల్ని పబ్బులకు రాసిచ్చి,
తెలంగాణ ప్రజల తలరాతల్ని తాకట్టు పెడితిరి.
సాలు దొర- సెలవు దొర.

12. సచివాలయంలో అడుగుపెట్టరు,
సస్తున్నం మొర్రో అని మొత్తుకున్నా ప్రజలను పట్టించుకోరు.
సాలు దొర- సెలవు దొర.

13. సర్‌ ప్లస్‌ బడ్జెట్‌ తో చేతిల పెట్టిన రాష్ట్రాన్ని,
అప్పుల కుప్ప చేసి, తిప్పలు పెడుతుంటిరి.
సాలు దొర- సెలవు దొర.

14. పోడు భూములపై పూటకో మాట,
గోడు పట్టించుకోకుండా ఆదీవాసులతో ఆటా?
సాలు దొర- సెలవు దొర.

15. తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లు దాటినా,
పాలమూరు వలసలు తగ్గలే.
కృష్ణ-గోదారి నీళ్లతో, తెలంగాణ బీళ్లు తడవలే.
ఇగ, సాలు దొర- సెలవు దొర.

16. కేజీ టు పీజీ ఉచిత విద్య లేదు.
ఫీజు రియంబర్స్‌ మెంట్‌ ఇస్తలేవు.
విశ్వవిద్యాలయాల వరకు, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసినవ్‌.
ఇగ, సాలు దొర- సెలవు దొర.

17. కొట్లాడిరది నీళ్లు, నిధులు, నియామకాల కోసం,
మిగిలింది కన్నీళ్లు, అప్పులు, ఆత్మహత్యలు.
ఇగ, సాలు దొర- సెలవు దొర.

18. ఉద్యమకారులను తరిమికొట్టినవ్‌,
ఉద్యమ ద్రోహులను భుజాన మోస్తున్నవ్‌.
ఇగ, సాలు దొర- సెలవు దొర.
19. మీ కుటుంబానికే పదవులు,
మీ కుటుంబానికే కొలువులు.
ఓ నయా నిజాం, నియంతృత్వమే నీ నైజం.
సాలు దొర- సెలవు దొర.

20. డబ్బా ఇండ్లూ కాదు, డబులు బెడ్రూం కట్టిస్తనంటివి.
ఉబ్బిచ్చే మాటలు చెప్తూ, పబ్బం గడుపుతుంటివి.
సాలు దొర- సెలవు దొర.

21. జర్నలిస్టులకు ఇండ్ల జాగ ఇస్తనంటివి,
కాంట్రాక్టు ఉద్యోగాలే లేకుండా చేస్తనంటివి.
నీ గారడీ మాటలకో దండం, నీ గడీల పాలనకో దండం.
సాలు దొర- సెలవు దొర.

22. దళితలకు మూడెకరాల భూమి
దగ చేసిన నీ బూటకపు హామీ.
జూఠా మాటల కేసీఆర్‌,
ఇగ… నీ ఆటలు సాగవ్‌ ఖబర్థార్‌.
సాలు దొర- సెలవు దొర.

23. బీసీల సంక్షేమంతో పాటు రిజర్వేషన్లనూ మింగేస్తివి.
బాసులం మేమేనని అధికారం చెలాయిస్తుంటిరి.
సాలు దొర- సెలవు దొర.

24. రాజ్యాంగాన్ని అవమానిస్తివి.
ప్రజాస్వామ్యానికి తూట్లూ పొడిచి,
నియంతృత్వ కుటుంబ పాలనకు ఊపిరి పోస్తివి.
సాలు దొర- సెలవు దొర.

25. ఆర్టీసీ కార్మికులను రోడ్డెక్కిస్తివి,
ఆర్టీసీ చార్జీలు పెంచి, పేదల నడ్డి విరిస్తివి.
సాలు దొర- సెలవు దొర.

26. మంచిగున్న సచివాలయం కూలగొడ్తివి.
ముప్పు పొంచి ఉన్న ఉస్మానియా ఆస్పత్రిని పట్టించుకోపోతివి.
సాలు దొర- సెలవు దొర.

27. ఏడంచెల గడీలతో నీ ఫామౌజ్‌ కట్టుకుంటివి.
అంబేడ్కర్‌ విగ్రహం, అమరవీరుల స్మారక స్థూపాన్ని మాత్రం యాదిమరిస్తివి.
సాలు దొర- సెలవు దొర.

28. ఎనిమిదేండ్లళ్ల ఏం మారింది?
తెలంగాణ పొలాలకు నీళ్లు రాలే.
తెలంగాణ పొరగాళ్ల నియమకాలు కాలే.
తెలంగాణ నిధులన్ని అప్పులకే సరిపోతుండే.
సాలు దొర- సెలవు దొర.
29. ఎన్నికలొస్తే జూఠా మాటలు,
ఎన్నికైనంక మాయ మాటలు.
ఇగ సాగవు సారు, నీ ఆటలు.
సాలు దొర- సెలవు దొర.

30. పట్టపగలే రోడ్లపైన హత్యలు
పట్టపగలే మొగ్గలపై అత్యాచారాలు
పట్టని ప్రభుత్వం, పట్టించుకోని యంత్రాంగం.
సాలు దొర- సెలవు దొర.

31. ఎనిమిదేండ్ల గడీల యుగం,
తెలంగాణ మొత్తం ఆగమాగం.
నీళ్లు, నిధులు నియామకాలను బొందవెట్టిన
నీ బంగారు తెలంగాణ ఒక మోసం.1

Read more RELATED
Recommended to you

Latest news