700 కిలో మీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్…!

-

ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో 700 కిలో మీటర్ల మేరకు ట్రాఫిక్‌ స్తంభించింది. లాక్‌డౌన్‌కు కొన్ని గంటల ముందు ఏర్పడిన పరిస్థితి ఇది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఫ్రాన్స్‌లో రెండో సారి లాక్‌డౌన్‌ విధించింది ప్రభుత్వం. దీంతో జనం స్వస్థలాలకు బయలుదేరారు. వేలాది వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. దీంతో మరికొన్ని గంటల్లో లాక్‌డౌన్‌ అమల్లోకి వస్తుందనగా… నగరాలకు వెలుపలకు దారితీసే మార్గాలన్నీ ట్రాఫిక్‌ రద్దీ వల్ల మూసుకుపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ ఏడాది మార్చిలోనూ పారిస్‌లో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఫ్రాన్స్‌లో తొలిసారిగా లాక్‌డౌన్‌ విధించినప్పుడు పారిస్‌ నుంచి దాదాపు 12 లక్షల మంది స్వస్థలాలకు వెళ్లిపోయారు. నగరం దాదాపు ఐదో వంతు ఖాళీ అయిపోయింది. అప్పట్లో కూడా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. ఇదిలా ఉంటే… లాక్‌డౌన్‌ కారణంగా నిత్యావసరాలను నిల్వ చేసుకోడానికి కూడా జనం పోటీ పడ్డారు. దీంతో షాపుల్లోనూ రద్దీ కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news