ఈనెల 3 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ నెల 3 నుంచి ఆదివారాలు మినహా సమావేశాలు ముగిసే వరకూ.. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తామని నగర ట్రాఫిక్ అదనపు సీపీ జి.సుధీర్‌బాబు తెలిపారు. ఆయా సమయాల్లో వాహనాల నిలుపుదలతో పాటు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఈ మార్గాల్లోనే..
తెలుగుతల్లి- ఇక్బాల్ మినార్ – రవీంద్రభారతి- వి.వి.విగ్రహం- షాదన్‌కళాశాల- నిరంకారి- సైఫాబాద్ పాతపోలీస్‌స్టేషన్- మాసబ్‌ట్యాంక్- పీటీఐ బిల్డింగ్-అయోధ్య, నిరంకారి-న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్- బషీర్‌బాగ్ జంక్షన్ టు ఓల్డ్ పీసీఆర్ జంక్షన్, బీజేఆర్ విగ్రహం- ఏఆర్ పెట్రోల్‌పంప్- నాంపల్లి రైల్వేస్టేషన్- ఎంజేమార్కెట్- తాజ్ ఐలాండ్- బీఆర్కే భవన్- ఆదర్శ్‌నగర్- ఓల్డ్ పీసీఆర్ జంక్షన్- మినిస్టర్స్ రెసిడెన్సీ కాంప్లెక్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబరు 12- విరంచి హాస్పిటల్- మాసబ్‌ట్యాంక్.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు-కేబీఆర్పార్క్-ఎల్వీప్రసాద్ ఐ హాస్పిటల్- శ్రీనగర్ కాలనీ జంక్షన్- నిమ్స్ – వి.వి.విగ్రహం, ఈఎస్ఐ ఆసుపత్రి- ఎస్.ఆర్.నగర్ మెట్రోస్టేషన్-అమీర్‌పేట్ స్టేషన్- పంజాగుట్ట జంక్షన్- నిమ్స్- వి.వి.విగ్రహం, సీటీవో జంక్షన్- ప్యారడైజ్- రాణిగంజ్- కర్బలా- చిల్డ్రన్‌పార్క్- ట్యాంక్‌బండ్- అంబేడ్కర్ విగ్రహం-తెలుగుతల్లి -ఇక్బాల్మినార్-రవీంద్రభారతి, ప్లాజా జంక్షన్- ప్యాట్నీ- బాటా- బైబిల్‌హౌస్- కర్బలా ప్రాంతాల్లో అమలులో ఉంటాయన్నారు.