సూర్యాపేటలో విషాదం.. కారు కింద పడి చిన్నారి మృతి!

కారు కింద పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన సంక్రాంతి విజయ శేఖర్, శిరీష దంపతులకు ఇద్దరు కుమార్తెలు. విజయ్ శేఖర్ ఇంటికి మధ్నాహ్నం బంధువులు కారులో వచ్చారు. అయితే బంధువులు ఇంట్లోకి వెళ్లగానే.. కారు డ్రైవర్ ఎదురుగా ఉన్న చెట్టు కింద కారును పార్క్ చేయాలనుకున్నాడు.

రోడ్డు ప్రమాదం-చిన్నారి మృతి
రోడ్డు ప్రమాదం-చిన్నారి మృతి

శిరీష ఎదురింట్లోకి వెళ్లినప్పుడు ఆమె వెంట 18 నెలల చిన్నారి షణ్ముఖ వెళ్లింది. అయితే కారు వెనుక డోర్ దగ్గర షణ్ముఖ ఆడకుంటోంది. ఇంతలోనే డ్రైవర్ కారును నడిపాడు. చిన్నారిని గమనించకుండా.. కారును నడిపాడు. దీంతో షణ్ముఖ తలపై కారు ఎక్కింది. చిన్నారి కేకలు విన్న కుటుంబసభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాలికను కోదాడ ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.