ఏపీ అర్చకులు, ఇమాం మౌజంలు, పాస్లర్లకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొదటి విడతలో 5196 మందికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనంగా అందించేందుకు నిధులు విడుదల చేశామని ఏపీ డిప్యూటీ అంజాద్ బాషా ప్రకటన చేశారు. గౌరవ వేతనం అందించేందుకు రూ.2 కోట్ల 59 లక్షలు విడుదల చేసినట్లు తెలిపారు.
విజయవాడలో ఏపీ మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ అంజాద్ బాషా స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ అంజాద్ బాషా మాట్లాడుతూ.. మొదటి విడత జాబితా ఆధారంగా పాస్టర్లకు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని వెల్లడించారు.
ఏపీలో అర్హత కలిగిన ప్రజలందరికీ సంక్షేమ కార్యక్రమాలను రూపొందించి అమలు చేసే దిశగా సీఎం జగన్ పని చేస్తున్నారన్నారు. ఏపీ ప్రజలందరూ సుఖ ః సంతోషాలతో ఉండాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం చిత్త శుద్దితో, అంకిత భావంతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.