బిజెపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి – హరీష్ రావు

-

బీబీసీ కార్యాలయంపై ఐటి దాడులు జరగడం బాధాకరం అన్నారు మంత్రి హరీష్ రావు. వార్తల్లో తప్పుంటే ఖండించాలని, వాస్తవం ప్రజలకు చెప్పాలి కానీ ఐటీ దాడులు చేయడం సరికాదన్నారు. ఒకాయన పేల్చుతా అంటే.. మరో అతను కూల్చేస్తా అని విపక్షాలు అంటున్నాయని మండిపడ్డారు. పేల్చేవాళ్లు, కూల్చేవాళ్లే కాదని.. కట్టేవాడు నిర్మించేవాడు తెలంగాణ రాష్ట్రానికి అవసరం అన్నారు. గతంలో ఆంధ్రా వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో ఒక ఎకరం అమ్మి తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని… కానీ పరిస్థితి ప్రస్తుతం కాలం మారిందన్నారు.

డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ లో వైద్య సేవలలో చివరి స్థానంలో ఉందన్నారు. తెలంగాణకు వచ్చి వైద్య సేవలపై కామెంట్లు చేసే కేంద్ర మంత్రులు వారి రాష్ట్రాలలో వైద్య సేవలు గురించి ఆలోచన చేయాలని సూచించారు. కెసిఆర్ ఆదేశానుసారం 88 వేల పోస్టుల భర్తీ చేయబోతున్నామని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తుంటే.. బిజెపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news