వైయస్ వివేకా హత్య కేసు విచారణ మరో కీలక మలుపు తిరిగింది. ఇన్నాళ్లు ఏపీ కేంద్రంగా జరుగుతున్న విచారణ ఇప్పుడు హైదరాబాద్ కి బదిలీ అయింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత వేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు తీర్పుతో హైదరాబాద్ లోని సిబిఐ స్పెషల్ కోర్టు ఈ కేసును విచారించనుంది.
విస్తృత స్థాయిలో జరిగిన కుట్ర పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆధారాలను మాయం చేశారన్న ఆరోపణలపై సిబిఐ విచారణ చేయాలని ఆదేశించింది. అయితే ఈ కేసుని బదిలీ చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణలో విచారణ జరిగితే చాలా మంచిదన్నారు. ” హత్యకు గురైన వైఎస్ వివేక మా నాయకుడు.. సీఎం జగన్ కి చిన్నాన్న. ఈ కేసులో వాస్తవాలు బయటకి రావాలని కోరుకుంటున్నాం ” అన్నారు సజ్జల.