మతిమరుపుకు కేవలం 20 నిమిషాల్లో చికిత్స.. ఈ క్యాప్‌ పెడితే చాలట..!

-

మతిమరుపు ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. చిన్నవిషయాలు కూడా మర్చిపోతుంటే..మనకు మనతో పాటు ఉన్నవాళ్లకూ ఇబ్బందే.. వయసు పెరిగే కొద్ది మతిమరుపు రావడం సహజం. కానీ ఈరోజుల్లో అన్‌హెల్తీ లైఫ్‌స్టైల్‌ వల్ల చిన్నవయసులోనే మతిమరుపు వస్తుంది. దీంతో అటు చదువు, ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వారికి శుభవార్త..అత్యాధునిక చికిత్సతో కేవలం 20 నిమిషాల్లో మతిమరుపు వ్యాధిని పోగొట్టొచ్చట.

మెదడులో కణాలు, నరాలు దెబ్బతినడం వల్ల మతిమరుపు వస్తుంది. మెదడు జాగ్రత్తగా ఉండాలంటే ప్రారంభ దశలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తలకి బలమైన దెబ్బ తగిలినప్పుడు, విటమిన్స్ లోపం, బ్రెయిన్ ట్యూమర్స్ వంటి వాటి వల్ల కూడా ఒక్కోసారి జ్ఞాపకశక్తి మందగిస్తుంది. ఒకసారి మర్చిపోతే దాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం చాలా కష్టం.. కేవలం 20 నిమిషాల చికిత్సతో మీ మతిమరుపుని మాయం చేయవచ్చని అంటున్నారు నిపుణులు…

ఎలక్ట్రోడ్ క్యాప్‌తో..

బోస్టన్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఒక కొత్త నివేదిక తీసుకొచ్చారు.. ఎలక్ట్రోడ్‌లతో కూడిన ఒక క్యాప్ ధరించడం వల్ల ఇది సాధ్యపడుతుందని వారు అంటున్నారు. ఇది మెదడులోకి విద్యుత్ సంకేతాలను పంపిస్తుంది. దాని వల్ల జ్ఞాపకశక్తి పని తీరు మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

అధ్యయనం ఇలా జరిగింది..

ఈ అధ్యయనంలో పాల్గొన్నవాళ్ళకి వరుసగా నాలుగు రోజుల పాటి 20 నిమిషాలు ఎలక్ట్రికల్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పెట్టారు. రోగులకి 20 పదాలు ఇచ్చి వాటిని గుర్తుంచుకోమని చెప్పారు. మళ్ళీ వాటిని వెంటనే పఠించాలని చెప్పారు. మూడు నాలుగు రోజుల తర్వాత తక్కువ ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ బ్రెయిన్‌కి పంపించారు. ఆ తర్వాత వారిలో మెరుగైన స్వల్ప కాలిక జ్ఞాపకశక్తి మెరుగుపడింది. హై-ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఇవ్వడం వల్ల సత్ఫలితాలు కనిపించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. జ్ఞాపకశక్తి సమస్యలు ఉన్న వాళ్ళు దీని ద్వారా మెరుగైన ఫలితాలు పొందుతారని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ క్యాప్‌ త్వరలోనే మార్కట్‌లోకి వస్తే.. అల్జీమర్స్‌తో బాధపడేవారికి కాస్త ఉపశమనం లభించినట్లే..చిన్నవయసులోనే మతిమరుపు సమస్య ఉంటే..తినే ఆహారం మీద శ్రద్ద పెట్టాలి. పోషకాహారం ముఖ్యంగా బ్రెయిన్‌కు మేలు చేసేవి తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news