Metabolic Surgeryతో మధుమేహానికి చికిత్స..?

-

డయబెటీస్ గురించి మనం రోజూ వింటూనే ఉంటాం. ఇప్పటికే చాలా తెలుసుకున్నాం.. నేడు ప్రపంచంలో అతిపెద్ద సమస్య మధుమేహం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో 2 బిలియన్లకు పైగా ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. సుమారు 422 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. దీనితో పాటు మధుమేహం కారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏటా దాదాపు 15 లక్షల మంది మరణిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా జీవక్రియ శస్త్రచికిత్స చేస్తున్నారు. ఊబకాయాన్ని తగ్గించడానికి, టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడానికి జీవక్రియ శస్త్రచికిత్స(Metabolic Surgery) అత్యంత ప్రభావవంతమైన మార్గంగా వైద్యులు నమ్ముతారు. మెటబాలిక్ సర్జరీ ద్వారా ఉదర శస్త్రచికిత్స చేయడం ద్వారా ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుందట.. ఇంతకీ ఈ చికిత్స ఏంటి, దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం..!
బరియాట్రిక్ మరియు లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ అపర్ణ భాస్కర్ స్థూలకాయాన్ని తగ్గించడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి మెటబాలిక్ సర్జరీ ఉత్తమ మార్గం అని చెప్పారు. వాస్తవానికి, మధుమేహం చికిత్స యొక్క అంతిమ లక్ష్యం రక్తంలో చక్కెర, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం. వీటన్నింటిని నియంత్రించడం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మధుమేహం యొక్క తీవ్రత తరువాత కంటి సంబంధిత రెటినోపతి, కిడ్నీ సంబంధిత నెఫ్రోపతి, అనేక గుండె సంబంధిత వ్యాధులకు కారణం అవుతుంది.. గత కొన్నేళ్లుగా స్థూలకాయంతో టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి బరువు తగ్గడం ఒక పటిష్టమైన చికిత్సగా చూడబడుతోంది. బరువు తగ్గినట్లయితే, రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. ఈ రోజుల్లో మెటబాలిక్ సర్జరీ ట్రెండ్ పెరగడానికి కారణం ఇదే.
జీవక్రియ శస్త్రచికిత్స అంటే..
మెటబాలిక్ లేదా బేరియాట్రిక్ సర్జరీలో గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, స్లీవ్-ప్లస్ విధానాన్ని అవలంబిస్తారు. ఇందుకోసం కడుపులో ఆపరేషన్ చేస్తారట. మెటబాలిక్ సర్జరీ వల్ల బరువు నియంత్రణతోపాటు మధుమేహాన్ని నియంత్రిస్తుందని డాక్టర్ అపర్ణ వివరిస్తున్నారు. వాస్తవానికి, శరీరంలోని చెడు అవయవాలను సరిచేయడానికి శస్త్రచికిత్స అవసరం, కానీ జీవక్రియ శస్త్రచికిత్సలో, సరైన అవయవాలను మరింత ప్రభావవంతంగా మార్చడానికి మార్పులు చేయబడతాయి. ఇది జీవక్రియను పెంచుతుంది. శరీరంలో మెటబాలిజం సరిగ్గా జరిగితే శరీరం తనంతట తానుగా అనేక వ్యాధులతో పోరాడగలుగుతుందని దీని ఉద్దేశం.

Read more RELATED
Recommended to you

Latest news