పుచ్చకాయ గింజలు వలన ఇన్ని లాభాలా..?

-

ఇక పుచ్చకాయల సీజన్ మొదలైంది. చాలామంది పుచ్చకాయలని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవిలో వాతావరణం వేడిగా ఉంటుంది. ఎండలు మండిపోతూ ఉంటాయి అటువంటప్పుడు చల్లగా పుచ్చకాయ తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. పైగా దాహం కూడా తీరుతుంది. అయితే చాలామంది పుచ్చకాయలని తినేసి గింజలని పారేస్తూ ఉంటారు.

కానీ పుచ్చకాయ గింజల వలన చక్కటి ప్రయోజనాలని పొందవచ్చు అని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. మరి పుచ్చకాయ గింజల్ని తీసుకుంటే ఎటువంటి లాభాలని పొందొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. పుచ్చకాయ గింజలు పురుషుల ఆరోగ్యం కి కూడా చాలా మేలు చేస్తాయి.

పురుషుల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి:

పుచ్చకాయ గింజలు పురుషుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి స్పెర్మ్ కౌంట్ ని పెంచడానికి సహాయపడతాయి. ఈ పండు గింజలు తీసుకోవడం వలన సంతాన సమస్యలు ఏమి ఉండవు.

పోషక పదార్థాలు అందుతాయి:

పుచ్చకాయ గింజలలో సెలీనియం, జింక్, పొటాషియం, ప్రోటీన్, కాపర్ వంటి పోషక పదార్థాలు ఉంటాయి. కనుక ఈ గింజల్ని తీసుకుంటే చక్కటి పోషక పదార్థాలు మీకు లభిస్తాయి. ఇందులో ఉండే సిట్రులిన్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇందులో జింక్ కూడా ఉంటుంది.

ఈ సమస్యలూ వుండవు:

మాంగనీస్, లైకోపీన్, లైసిన్, అర్జినిన్, గ్లూటామిక్ యాసిడ్ ఇందులో ఉంటాయి. అలానే ఇవి జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం ని మెరుగుపరుస్తాయి. కనుక ఇన్ని లాభాలు వున్నాయి కాబట్టి ఈసారి పుచ్చకాయ గింజల్ని తీసుకోండి పారేయద్దు.

Read more RELATED
Recommended to you

Latest news