ఖైరతాబాద్ కథ…మూడు పార్టీల్లో పోరు?

-

ఖైరతాబాద్ నియోజకవర్గం పేరు చెప్పగానే మొదట గుర్తొచ్చే పేరు పీజేఆర్…దశాబ్దాల పాటు పి. జనార్ధన్ రెడ్డి ఖైరతాబాద్‌ని తన అడ్డాగా మార్చుకుని గెలుస్తూ వచ్చారు. కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న పీజేఆర్…1978లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో గెలిచారు. ఇక పీజేఆర్ మరణంతో 2008లో ఉపఎన్నిక రాగా, ఆ ఉపఎన్నికలో పీజేఆర్ వారసుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు.

ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో అప్పటివరకు అసిఫ్‌నగర్లో పోటీ చేస్తూ వచ్చిన దానం నాగేందర్…2009లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక 2014లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి…బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చేశారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసి సత్తా చాటాలని దానం నాగేందర్ చూస్తున్నారు.

అయితే నెక్స్ట్ ఎన్నికల్లో దానంకు గెలుపు ఈజీ కాదు…ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది…అదే సమయంలో బీజేపీకి బలం ఉంది. పైగా ఈ సీటు కోసం టీఆర్ఎస్ నుంచి మరో నేత పోటీ పడుతున్నారు. మన్నే గోవర్ధన్ సైతం ఖైరతాబాద్ టీఆర్ఎస్ సీటు ఆశిస్తున్నారు. టీఆర్ఎస్ లోనే కాదు ఖైరతాబాద్ సీటు కోసం కాంగ్రెస్, బీజేపీల్లో కూడా పోటీ ఉంది. ఇటీవలే పీజేఆర్ తనయురాలు విజయారెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే…ఈమెకే కాంగ్రెస్ సీటు దక్కుతుందని ప్రచారం జరుగుతుంది.

అటు రోహిన్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఈ పోరు తట్టుకోలేక శ్రవణ్ బీజేపీలోకి వెళ్లారు…దీంతో బీజేపీలో పోటీ పెరిగింది. ఇప్పటికే సీనియర్ నేత చింతల ఉన్నారు…ఆయనకు పోటీగా శ్రవణ్ తయారయ్యారు. ఇలా మూడు పార్టీల్లో ఖైరతాబాద్ సీటు కోసం పోటీ నెలకొంది. మరి చివరికి సీటు ఎవరికి దక్కుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news