Trisha Krishnan : ఎవర్ గ్రీన్ బ్యూటీ త్రిష సొగసు చూడతరమా..?

-

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం పొన్నియున్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది త్రిష. ఇందులో భాగంగానే రోజూ డిఫరెంట్ ఔట్ ఫిట్స్ లో వెరైటీ లుక్స్ లో కనిపిస్తూ అభిమానులను ఖుష్ చేస్తోంది. దాదాపు త్రిష ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ట్రెడిషనల్ లుక్ నే ఎంచుకుంటోంది.

తాజాగా త్రిష ఈ సినిమా ప్రమోషనస్ కోసం బ్లూ కలర్ అనార్కరీ, క్రీమ్ కలర్ ట్రెడిషనల్ ఔట్ ఫిట్, గ్రీన్ కలర్ చీరలో సందడి చేసింది. ఈ లుక్స్ లో త్రిష చాలా అందంగా కనిపిస్తోంది. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా కనిపిస్తూ త్రిష తన అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. తలలో మల్లెపూలు పెట్టుకుని కుందనపు బొమ్మలా కనిపిస్తోంది.

ఇక త్రిష సినిమాల విషయానికి వస్తే ఈ భామ తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసి చాలా ఏళ్లవుతోంది. ప్రజెంట్ ఈ భామ ఫోకస్ అంతా తమిళనాడుపైనే ఉంది. ఈ బ్యూటీ తాజాగా ఇళయదళపతి విజయ్ తో కలిసి లియో సినిమాలో సందడి చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news