తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావిడి చాలా గట్టిగా వినబడుతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కచ్చితంగా ఈ ఎన్నికలలో రాణించాలని ఎవరికి వారు కంకణం కట్టుకొని వ్యూహ ప్రతివ్యూహాలతో దూసుకుపోతున్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కనబడుతోంది.
ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు ఖమ్మం జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి లో సౌమ్యుడిగా పేరున్న నేత భట్టి విక్రమార్క కి ఖమ్మం జిల్లా సొంత నియోజకవర్గం మధిరలో మునిసిపాలిటీల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి హైకమాండ్ దృష్టిలో మార్కులు కొట్టేద్దామని భావిస్తున్న తరుణంలో ఖమ్మంలో పరిస్థితులు వార్ వన్ సైడ్ అన్నట్టుగా మొత్తం చాలా వరకు దాదాపు మున్సిపాలిటీ స్థానాలు టిఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడినట్లు తెలంగాణ రాజకీయాల వినబడుతున్న టాక్.
ముఖ్యంగా మధిరలో మొత్తం 22 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మొత్తం అన్ని వార్డులకూ కలిపి 120 మంది వరకూ నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే ఉపసంహరణ తర్వాత చివరకు 67 మంది బరిలో నిలిచారు. ఇక ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ మొత్తం 22 వార్డులకూ అభ్యర్థులను బరిలో నిలిపింది. అయితే మధిరలో ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తుంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా 22 వార్డులను కాంగ్రెస్ ఖాతాలో వెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్న భట్టివిక్రమార్క కి ఎలక్షన్ కి ముందే చేదు అనుభవం ఎదురైనట్లు ఖమ్మంలో ముఖ్యంగా మధిరలో టిఆర్‌ఎస్ గాలి ఈ సారి బలంగా ఉన్నట్లు ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఈ ప్రాంతంలో చూస్తే 0 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితం కానున్నట్లు తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.