వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన మాజీ ఎంపీపీ, తెరాస మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పరకాల సబ్ జైలుకు రిమాండ్‌కు తరలించినట్లు కేయూ ఎస్సై సంపత్ తెలిపారు. తల్వార్లు, డమ్మీ తుపాకీతో బెదిరించి పలువురి నుంచి భూములు లాక్కున్న కేసులో సారంగపాణిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
42 రోజుల క్రితం ఓ పోలీసు అధికారితో పాటు మరో ఏడుగురు వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో భూకబ్జాలకు పాల్పడగా బాధితులు కేయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ కేసులో నిందితులుగా ఉన్న ఏడుగురిని అరెస్టు చేసి పరకాల సబ్ జైలుకు తరలించారు. ఈ కేసులో సారంగపాణి హస్తం ఉన్నట్లు విచారణలో తేలడంతో అతణ్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు.