కేసీఆర్‌తోనే బంగారు భారత్.. టీఆర్ఎస్ 33 జిల్లాల అధ్యక్షులు

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు, ఇతర పార్టీల నేతలతో తరచూ భేటీ అవుతున్నారు. బీజేపీని కేంద్రంలో గద్దె దించడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలనే ఐక్యతారాగాన్ని వినిపిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్‌తోనే భారత్‌కు బంగారు భవిష్యత్ సాధ్యమవుతుందని టీఆర్ఎస్ పార్టీ 33 జిల్లాల అధ్యక్షులు భావిస్తున్నారు. అందుకే కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు.

నరేంద్రమోదీ అస్తవ్యస్త పాలనతో విసిగి వేసారుతున్న దేశ ప్రజలు కేసీఆర్‌ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ విపక్షంగా విఫలమైన ఈ తరుణంలో కేసీఆరే నిజమైన ప్రత్యామ్నాయంగా యావత్‌ దేశం గుర్తించిందని అన్నారు. బీజేపీ ముక్తభారత్‌ కోసం కేసీఆర్‌ వెంటనే జాతీయ పార్టీని స్థాపించాలని కోరారు. అన్ని రాష్ట్రాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని, తామంతా ఆయన వెంటే నడుస్తామని భరోసానిచ్చారు. తెలంగాణ ప్రగతి నమూనా దేశమంతటికీ విస్తరించాలని, బంగారు భారత్‌గా మారాలని విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం తెలంగాణభవన్‌లో 33 జిల్లాల తెరాస అధ్యక్షులు సమావేశమయ్యారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలని వారంతా ముక్తకంఠంతో కోరారు. ఈ సందర్భంగా బాల్కసుమన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, మాలోత్‌ కవిత, లింగయ్య యాదవ్‌, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్‌, వినయ్‌భాస్కర్‌, చింతా ప్రభాకర్‌, గువ్వల బాలరాజు, మెతుకు ఆనంద్‌, సంపత్‌రెడ్డి, తాత మధు, తోట ఆగయ్య, రామకృష్ణారావు, శంభీపూర్‌రాజు, అరూరి రమేశ్‌, ముజీబ్‌ తదితరులు మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news