60 లక్షల సభ్యత్వం ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తుమ్మితే కొట్టుకుపోతారని బీజేపీకి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ వార్నింగ్ ఇచ్చారు. వరంగల్ పొరుగల్లు అని… ఉద్యమానికి అండగా నిలిచిన గడ్డ వరంగల్ అని స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్త శుద్ధి ఉంటే కేంద్రం నుండి రావాల్సిన నిధులు, నియామకాలకు, ప్రాజెక్టులకు నిధులు తీసుకొని రావాలని సవాల్ విసిరారు.
బీజేపీ నేతలు బెదిరింపుల తో తమ నోరు నొక్కి ప్రయత్నం చేస్తున్నారని… మీ బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఖజిపేట్ స్టేషన్ కి గొప్ప చరిత్ర ఉందని… నిజం పాలనలోనే ఆదరణను పొందిన స్టేషన్ ఖజిపేట్ అన్నారు. అలాంటి ఖజిపేట్ రైల్వే స్టేషన్ కి రావాల్సిన పరిశ్రమలను కేంద్రము ఇవ్వడం లేదని మండిపడ్డారు.
కోచ్ ఫ్యాక్టరీ డిమాండ్ బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదని… కొచ్ ఫ్యాక్టరీ అంశంలో అప్పుడు కాంగ్రెస్ మోసం చేస్తే ఇప్పుడు బీజేపీ దగా చేస్తుందని మండిపడ్డారు.మాకు కోచ్ ఫ్యాక్టరీ..ఉక్కు ఫ్యాక్టరీ వస్తుందా లేదా అనేది తమ సూటి ప్రశ్న అని.. ఇవి ఇవ్వకపోతే పొరుగల్లు లాంటి ఓరుగల్లు మరో ఉద్యమానికి కేంద్రం కాబోతోందన్నారు.