కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రతినిధులు కూడా ముందుకి రావాలని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు ఇచ్చిన నేపధ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇప్పుడు తెలంగాణాలో రంగంలోకి దిగారు. దాన్ని ఏ విధంగా అయినా సరే అదుపు చెయ్యాలని భావిస్తున్నారు. పోలీసులు, అధికారులకు ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు. రోడ్ల పైకి వచ్చే వారికి క్లాస్ పీకుతున్నారు
ఎక్కడిక్కడ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కెసిఆర్ ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ లు, పలు నగరాల్లో ఉండే కార్పొరేటర్లు, మేయర్లు ఇలా అందరూ కూడా రంగంలోకి దిగారు. ప్రజలు బయటకు రాకుండా అవగాహన చర్యలు చేపడుతున్నారు. చౌరస్తాల్లో నిలబడి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. తెలంగాణాలో లాక్ డౌన్ అమలు చేయడానికి గాను తమ వంతు సహకారం అందిస్తున్నారు.
ఇటీవల తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ ప్రజలు బయటకు రాకుండా ఉండటానికి అందరూ కూడా సహకరించాలని, ఎవరూ కూడా ఇళ్ళల్లో ఉండటానికి వీలు లేదని ప్రజా ప్రతినిధులను ఆయన హెచ్చరించారు. ఇక అక్కడి నుంచి వాళ్ళు బయటకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణాలో కరోనా కేసులు 60 వరకు నమోదు అయ్యాయి.