త్రిదండి చిన్న జీయర్ స్వామీజి..వన దేవతలైన సమ్మక్క- సారలమ్మలపై చేసిన కామెంట్లు.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదేపిస్తున్నాయి. గతంలో త్రిదండి చిన్న జీయర్ స్వామీజి…మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో.. తెలంగాణ సమాజం ఓ ఆట ఆడుకుంటోంది. అయితే… చిన్న జీయర్ స్వామిజీ పై తాజాగా టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క – సారలమ్మలను కించ పరుస్తూ.. మాట్లాడిన చినజీయర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఆదివాసీ వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను కోట్లాది మంది ప్రజలు కొలుస్తున్నారని ఆయన చెప్పారు. చినజీయర్ స్వామిలా మోసాలకు పాల్పడటం తమ జాతికి తెలియదని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీల గూడాలలో చినజీయర్ దిష్టిబొమ్మలనను తగుల బెట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆదివాసీలకు క్షమాపణలు చేప్పే వరకు విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు.