భారత పర్యటనలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోడితో సమావేశమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మోడితో పలు కీలక అంశాలకు సంబంధించి చర్చలు జరిపి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. రక్షణ రంగం విషయంలో ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. ముఖ్యంగా రక్షణ రంగానికి అందించే ఆయుధ సంపత్తి గురించే ఇరువురి మధ్య ఎక్కువగా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది.
భారత్ కి అమెరికా కీలక ఆయుధాలను ఇవ్వనుంది. ఇది పక్కన పెడితే, ప్రస్తుతం జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం కి సంబంధించిన ఆందోళనపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసారు. మతపరమైన స్వేచ్ఛ గురించి మోదీ, నేను చర్చించాం. దేశ ప్రజలందరికీ మత స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటున్నట్లు మోదీ చెప్పారు. మతపరమైన స్వేచ్ఛ కోసం మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి కూడా మోదీతో చర్చించలేదు.
ఢిల్లీలో హింసాత్మక ఘటనల గురించి విన్నా. కానీ దానిపై మోదీతో చర్చించలేదు. భారత్‌లో జరుగుతున్న కొన్ని ఘటనలు ఈ దేశ అంతర్గతం.” అని అన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టం కి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీ లో ఆందోళనలు తీవ్రంగా జరుగుతున్నాయి. పౌరులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇవి హింసకు దారి తీసాయి. ఇందులో ఏడుగురు మరణించినట్టు సమాచార౦. అనుకూల వ్యతిరేక వర్గాలు దాడులు చేసుకుంటున్నాయి.