భారత ఎన్నారైలకు అనుకూలంగా ట్రంప్ కీలక నిర్ణయం..!!!

-

ఇటీవల భారత్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి భారీ స్థాయిలో ఆహ్వానం పలికి అతిధి ధర్మాన్ని పాటించింది. భారత్ లో పర్యటనకు వచ్చిన అధ్యక్షుడు ఆయన కుటుంబానికి ఆతిధ్య మర్యాదలు అందించింది కేంద్ర సర్కార్. ఎన్నో కట్టుదిట్టమైన భద్రతల నడుమ భారత పర్యటన ముగించుకొని ఎంతో సంతోషంగా తిరిగి అమెరికా కూడా వెళ్లిపోయారు. అయితే భారత్ పర్యటనలో ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, ట్రంప్ ల మధ్య కొన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే అది భారత ఎన్నారైల దశ మారుస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హెచ్ 1 బీ వీసా,హెచ్-4 వీసాల ప్రస్తావన జరిగినట్లు సమాచారం. ఒక్క వీసా గురించే కాకుండా అమెరికా లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ఎదురుకొంటున్న సమస్యలు ఇబ్బందులపై కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ చర్చల్లో భాగంగా ట్రంప్ ఈ అంశాలపై సానుకూలంగానే స్పందించారని తెలుస్తుంది.

ఈ నేపధ్యంలోనే మోడీ మీడియాతో మాట్లాడుతూ…అమెరికా,భారతదేశాల మధ్య ఇంత చక్కటి స్నేహ సంబంధానికి ముఖ్య కారణం అక్కడ నివసిస్తున్న భారత సంతతికి చెందిన వాళ్ళు, భారతీయ నిపుణులు, విద్యార్ధులు అంటూ పేర్కొన్నారు. మరోపక్క అమెరికా అధ్యక్ష ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నా కారణంగానే ట్రంప్ కూడా ఈ అంశాలపై సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో భారత ప్రవాసీయుల మద్దతు ట్రంప్ కు ఎంతో కీలకం అందుకే భారత సర్కార్ చెప్పిన అంశాలపై ట్రంప్ సానుకూలంగా స్పందించారని, త్వరలో భారత ఎన్నారైలకు సంబంధించి ట్రంప్ కొన్ని ముఖ్య నిర్ణయాలు కూడా తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news