బ్రేకింగ్: ఆప్ నేత తాహిర్ హుస్సేన్ సస్పెండ్

-

ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టిన ఆప్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అల్లర్ల లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, కౌన్సిలర్ అయిన తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనితో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆప్ అధినేత,ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసలో మృతి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ కేసులో ఆప్ నాయకుడు, స్థానిక నెహ్రూ విహార్ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌పై హత్యాయత్నం అభియోగాలు నమోదు అయిన సంగతి తెలిసిందే. తాహిర్ హుస్సేన్ ఇంటికి సమీపంలోనే అంకిత్ శర్మ మృతదేహం లభించడం తో పాటు ఐదు అంతస్తుల భవనం పై నుంచి కొందరు రాళ్లు రువ్వుతుండగా తాహిర్ అక్కడే ఉన్నట్లుగా కొన్ని వీడియో లు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తున్నాయి. దీనితో తాహిర్ హుస్సేనే అంకిత్ శర్మ మృతి కి భాద్యత వహించాలి అంటూ అంకిత్ శర్మ తండ్రి రవీందర్ శర్మ డిమాండ్ చేయడం తో ఢిల్లీ పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 హత్యాయత్నం కింద దయాల్‌పూర్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తుంది. కొందరు దుండగులు వచ్చి తన కుమారుడిని లాక్కెళ్లి కత్తులతో పొడిచి,తుపాకులతో కాల్చి చంపారంటూ రవీందర్ శర్మ ఆరోపించారు.

ఢిల్లీ చాంద్‌బాగ్ ప్రాంతంలో జరిగిన అల్లర్లకు తాహిర్ హుస్సేన్ కర్మాగారం, నివాసం కేంద్రాలుగా మారినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. తాహిర్ నివాసంపైకెక్కిన వందలాది దుండగులు పెట్రోల్, యాసిడ్ బాంబులు విసిరిన దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. మరోపక్క ఈ విషయమై తాహిర్ హుస్సేన్ స్పందిస్తూ ఐబీ అధికారి మరణానికి ఎలాంటి సంబంధం లేదని కొందరు దుండగులు నా ఇంట్లోకి చొచ్చుకుని వచ్చారు. వారిని ఆపేందుకు నేను ప్రయత్నించాను. నేను అమాయకుడిని అంటూ చెబుతున్నారు. అయితే తాహిర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు రావడం తో కేజ్రీ సర్కార్ చర్యలు చేపట్టి ఆయనపై వేటు వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news