మష్రూమ్స్‌, పాలకూర కాంబోతో ఇలా చేయండి..! సూపర్‌ టేస్ట్‌ అంతే..

-

మష్రూమ్స్‌ ప్రకృతి అందించిన రిచ్‌ విటమిన్‌ డీ..మెయిన్‌గా మష్‌రూమ్స్‌లో విటమిన్స్‌, మినరల్స్‌ ఉంటాయి. విటమిన్‌ b12 ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే D2 లోపలికి వెళ్లి D3గా కన్వర్ట్‌ అవుతుంది. ఎండతగలని వారు కూడా ఇది తింటుంటే.. విటమిన్‌ డీ లోపం బారిన పడకుండా ఉండొచ్చు. ఇంకా బఠానీలు అంటే మనకు ఎలాగూ తెలుసూ..డైజెషన్‌కు నెంబర్‌ వన్‌ ఐటమ్..ఇంకా పాలకూర. ఈ మూడింటి కాంబినేషన్‌తో కర్రీ చేస్తే అబ్బో పోషకాల ప్లేట్‌ పెట్టుకున్నట్లే..! కర్రీ ఎలా చేయాలో చూద్దామా..

మష్రూమ్‌ పీస్‌ పాలక్‌ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

మష్రూమ్స్‌ 250 గ్రాములు
పాలకూర తురుము రెండు కప్పులు
పచ్చిబఠానీ ఒక కప్పు
టమోటా ముక్కలు అర కప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
జీడిపప్పు టూ టెబుల్‌ స్పూన్‌
కర్భూజ గింజలు రెండు టేబుల్‌ స్పూన్స్‌
పచ్చిమిర్చి మూడు
అల్లంవెల్లుల్లి పేస్ట్‌ ఒక టేబుల్‌ స్పూన్
లెమన్‌ జ్యూస్‌ ఒక టేబుల్‌ స్పూన్
మీగడ ఒక టేబుల్‌ స్పూన్
బిర్యానీ ఆకు ఒకటి
దాల్చిన చెక్క ముక్క ఒకటి
లవంగాలు మూడు
యాలుక్కాయలు రెండు

తయారు చేసే విధానం..

ముందుగా ఒక నాన్‌స్టిక్‌ పాత్ర పొయ్యిమీద పెట్టి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ముక్క, లవంగాలు, యాలుకలు, జీడిపప్పు, కర్బూజ గింజలు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఒక కప్పు పాలకూర వేసి 7-8 నిమిషాలు మగ్గనివ్వండి. ఆయిల్‌, మీగడ వేయలేదు కాదా మాడిపోతుందేమో అనుకుంటారేమో..ఏం కాదు.. సిమ్‌లో పెట్టి చేయండి. ఇలా మగ్గిన తర్వాత చల్లారాక మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్‌ చేయండి. ఇందులోనే పెరుగు వేసి గ్రైండ్‌ చేసి పక్కనపెట్టుకోండి.
మరొక పాత్ర పొయ్యిమీద పెట్టి మీగడ వేసి అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పచ్చిబఠానీలు, చిన్నసైజు మష్రూమ్స్‌ వేసి వేపండి. ఇప్పుడు ఇంకోకప్పు పాలకూర తురుము వేసి మూతపెట్టి పది నిమిషాలు మగ్గనివ్వండి. బాగా ఉడికిన తర్వాత ముందు చేసుకున్న గ్రేవీ వేయండి. బాగా కలుపుకుని ఐదు నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు నిమ్మరసం వేసి దించేయండి. ఆయిల్‌, సాల్ట్‌ లేకుండానే ఆరోగ్యకరమైన మష్రూమ్స్‌ పీస్‌ మసాల కర్రీ రెడీ. పుల్కాలు, రోటీలు,చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఓసారి ట్రే చేయండి.!

Read more RELATED
Recommended to you

Latest news