వైసిపి ప్లీనరీ సమావేశాలు త్వరలో జరగనున్నాయి. ఈ సమావేశంలో ఆ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పార్టీ నేతలంతా కలిసి ఎన్నుకొనున్నారు. వైసీపీ పార్టీ శాశ్వత గౌరవాధ్యక్షురాలిగా జగన్ తల్లి వైయస్ విజయమ్మ కొనసాగేలా తీర్మానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ మూడో ప్లీనరీని నిర్వహించుకుంటోన్నామని.. ప్రతిపక్షంలో నిర్మాణాత్మకంగా వ్యవహరించామని పేర్కొన్నారు విజయసాయి రెడ్డి. అధికారంలోకి వచ్చాక అదే నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తూ సామాజిక న్యాయం చేస్తున్నామని.. ప్రతినిధులందరికీ జగన్ సంతకంతో ఆహ్వానాలు పంపామన్నారు.
ప్లీనరీ విజయవంతం అనేది ఇప్పటి నుంచే కనబడుతోందని.. మొదటి రోజు లక్షన్నర మంది.. రెండో రోజు నాలుగు లక్షల మంది హాజరు కానున్నట్టు సమాచారమని వెల్లడించారు. సీఎం జగన్ మీదున్న నమ్మకం.. ప్రేమే ప్లీనరీని విజయవంతం చేయనుందని..చంద్రబాబు ఫ్రస్ట్రేషనులో ఉన్నారన్నారు.ప్లీనరీ మెనూలో పంది మాంసం పెట్టడం లేదు…. మా ప్లీనరీలో పంది మాంసం పెడుతున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. పంది మాంసం తిని తిని చంద్రబాబుకు అలవాటు అయిందేమో..? ప్లీనరీ జరిగే రెండు రోజుల పాటు వర్షం పడకూడదని వరుణ దేవుణ్ని కోరుకుంటున్నామన్నారు. జగన్ను శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకునే అంశంపై రేపు ప్రతిపాదిస్తామని వెల్లడించారు.