అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంసెట్-2022 కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తాజాగా మాట్టాడుతూ.. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పలు జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యార్థులను 2 గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోని అనుమతిస్తామని, పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించరు ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. డాక్యుమెంట్లను పరిశీలించి, విద్యార్థులను కేంద్రాల్లోని అనుమతిస్తారని, బయోమెట్రిక్ క్యాప్చరింగ్‌లో భాగంగా కుడి చేతి బొటనవేలి ముద్రను తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. ఒకరికి బదులు మరొకరు పరీక్షకు హాజరవడం కుదరదన్న ప్రొఫెసర్ గోవర్ధన్ .. పరీక్ష కేంద్రంలో విద్యార్థికి కేటాయించిన కంప్యూటర్‌పై అభ్యర్థి పేరు, ఫొటో మొదలైనవి ప్రదర్శితమవుతాయని తెలిపారు. పరీక్షకు 10-15 నిమిషాల ముందు విద్యార్థి ఐడీ, పాస్‌వర్డ్‌ను ప్రకటిస్తారు. వీటి ఆధారంగా సైన్‌ఇన్ బటన్ క్లిక్‌చేసి ప్రశ్నపత్రాన్ని ఓపెన్ చేయవచ్చు. నెగెటివ్ మార్కింగ్ లేదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలివ్వవచ్చని ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు.
విద్యార్థి ముందుగా ఏ సబ్జెక్టు (సెక్షన్)తో పరీక్షను ప్రారంభించాలనుకుంటున్నారో ఆ సబ్జెక్టును ఎంపిచేసుకోవచ్చని, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఏదీ కావాలంటే ఆయా సెక్షన్‌ను ఎంచుకోవచ్చన్నారు. కుడివైపున గల ప్యాలెట్‌లో ప్రశ్న నంబర్‌పై క్లిక్‌చేయగానే ప్రశ్నలు తెరపై కనిపిస్తాయని, వాటిని సమాధానాలిచ్చుకుంటూ వెళ్లాలన్నారు. విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలిచ్చేటప్పుడు ఆప్షన్‌ను ఎంపిక చేసుకొని సేవ్ అండ్ నెక్ట్స్ బటన్‌ను నొక్కాలని వివరించారు. ఇలా చేయడంతో ప్రశ్న నంబర్ గ్రీన్‌కలర్‌లోని మారుతుందని, నిర్దేశిత సమయంలో ప్రశ్నల జవాబులను ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చని ఆయన తెలిపారు. సమాధానం తొలగించాలనుకుంటే క్లియర్ రెస్పాన్స్ బటన్‌పై క్లిక్ చేయాలని, సరైనది అనుకుంటే సేవ్ చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రెడ్‌కలర్‌లోని ఉన్నవాటికి సమాధానాలు రాయలేదని అర్ధమని, పునరాలోచన కోసం మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్ట్స్ బటన్‌పై క్లిక్‌చేయాలన్నారు.
వాచ్‌లు, సెల్‌ఫోన్స్‌ను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదని, విద్యార్థుల సౌకర్యార్థం కంప్యూటర్‌పై భాగంగా కుడివైపున టైమర్ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పరీక్ష సమయంలో లేదా మధ్యలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే టెన్షన్ పడొద్దని, మీ చేతిని పైకి ఎత్తడం ద్వారా ఈ సమస్యను ఇన్విజిలెటర్‌కు చెప్పండన్నారు. ఎంసెట్‌కు 2,51,606 దరఖాస్తులు రాగా, క్రితం సంవత్సరంకటే.. కంటే 14,722 అధికంగా వచ్చాయని ఆయన తెలిపారు.