TSPSC లీకేజీ దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెళ్లడవుతున్నాయి. 6 పరీక్షలకు గాను మొత్తం 15 పేపర్లు ముందే లీక్ అయినట్లు సిట్ అధికారులు తేల్చారు. ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో ఆరు పోస్టులకు సంబంధించి ప్రశ్న పత్రాలను గుర్తించారు. ట్విస్ట్ ఏంటంటే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల పేపర్ల కోసం కూడా బేరాలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ లోపు స్కామ్ బయటపడినట్లు సమాచారం.
కాగా తెలంగాణలో కలకలం రేపిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో రూ.లక్షల్లో డబ్బు చేతులు మారినట్లు ఇప్పటికే సిట్ దర్యాప్తులో వెల్లడి కావడంతో త్వరలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగబోతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు కేసు నమోదుకు ఈడీ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.