నాలుగు గంటలకు పైగా కేబినెట్ సమావేశం అనంతరం… సీఎం కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లో జాయిన్ కావాలని కోరిన ఆయన ఆర్టీసీ ఛార్జీలు కిలో మీటర్‌కు 20 పైసలు పెంచుతున్న ఆయన స్పష్టం చేశారు. ఈ పెంపు సోమవారం నుంచి అమలవుతుందని కేసీఆర్ వెల్లడించారు. అలాగే ఛార్జీలు పెంచడం ద్వారా ఏడాదికి రూ. 750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. అదే విధంగా.. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరితే ఎలాంటి షరతులు విధించమన్నారు.
ప్రైవేట్ పర్మిట్లు కూడా ఆర్టీసీ వాళ్లకే ఇద్దామనుకున్నామని, ప్రగతిభవన్‌కు త్వరలో కార్మికులను పిలుస్తామన్నారు. మంచిచెడులు తానే అడిగి తెలుసుకుంటామని కేసీఆర్ చెప్పారు. ఆర్టీసీ సమస్యపై కొన్ని రోజులుగా జరుగుతున్న సమ్మె నేపథ్యంలో ఆయన కేబినెట్ సమావేశంలో లోతుగా చర్చించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు వెల్లడించారు.