జనసేన.. ఇదొక పెద్ద సమూహంతో కూడుకున్న.. ఓ సైన్యంతో నిండివున్న సమాజం అని అర్థం.. అంటే జనసేన అంటే జనమే ఒక సైన్యంగా తయారైన సంస్థ అని అర్థం వచ్చేలా.. ఎన్నో ఆదర్శభావాలతో ఏర్పాటు చేసిన ఈ జనసేన పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందంటే… జనంలేని.. సైన్యం లేని సంస్థగా మిగలిందనే అనే భావన అందరిలో కలుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నో ఆదర్శాలతో విప్లవయోధుడు చెగువేరా ఆశయంతో ఏర్పాటు చేసిన సంస్థ. తిరుగుబాటు భావాలున్న పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ గత ఎన్నికల కన్నా ముందు అంటే 2014 ఎన్నికల్లో ఆదర్శబావాలు వదిలేసి అవకాశ వాద రాజకీయాల కోసం పాకులాడి ఏకంగా బీజేపీ, టీడీపీ తో జతకట్టాడు.
అప్పుడే పవన్ కళ్యాణ్ ఆదర్శభావాలకు మంగళం పాడినట్లైంది.. అందుకే జనాలకు జనసేన పార్టీ స్థాపించినప్పటి సదాభిప్రాయం తరువాత కాలంలో లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో జనసేనలో అంతా అవకాశవాద రాజకీయ నాయకులు చేరయడంతో పార్టీలో విలువలు లేకుండా పోయాయని జనం పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ప్రజా సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం జగన్‌ను, ఆయన సర్కారును నిత్యం విమర్శిస్తుండటం నేతలు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఆనాడు ఏదైతే ఆదర్శాల కోసం పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించాడో.. ఆ ఆదర్శాలను పక్కనపెట్టి అవకాశ చంద్రబాబు ఆలోచనలో ముందుకు సాగుతున్న దాఖాలాలు స్పష్టం కావడంతో నేతలంతా పక్కకు తప్పుకుంటున్నారు.. ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ వ్యవహరశైలీని నచ్చక ఆయనకు దూరం జరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిరోజు ప్రజాసంక్షేమ పథకాలపై వ్యతిరేక విమర్శలు చేస్తుండటంతో ఆయన వెంటే ఉండే నేతలు జీర్ణించుకోలేక ఇప్పటికే అనేక మంది నాయకులు కూడా జనసేనను వీడిపోతున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, చింతల పార్థసారథి, మారంశెట్టి రాఘవయ్య, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, కావలి శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి సుధాకర్ జనసేనకు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు తాజాగా సీనియర్ నేత ఆకుల సత్యనారాయణ షాకిచ్చారు. ఇలా నేతలంతా ఒక్కొక్కరు బయటికి పోతుండగా, గ్రామ, మండల, జిల్లా స్థాయి నేతలు కూడా ఇప్పటికే వైసీపీ, బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు జనం లేక, సేన లేక జనసేన ఎలా ముందుకు పోతుందో అనే సందిగ్థంలో జనాలున్నారు… ఏదేమైనా ఆదర్శాల కోసం పుట్టిన పార్టీ.. ఇలా అపహస్యం పాలు కావడం విచిత్రమే.. మరి.. అంటే త్వరలో జనసేనాని కూడా బిస్తర్ సర్దుకోక తప్పదన్నమాట..