వైఎస్సార్సీపీ హయాంలో గోవుల గడ్డి కూడా తినేశారు : టీటీడీ ఛైర్మన్

-

వైఎస్సార్సీపీ హయాంలో గోవుల గడ్డిని కూడా తినేశారని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నారు. గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమీషన్లకు అమ్మేశారని సంచలన ఆరోపణలు చేశారు.  తిరుపతిలో టీటీడీ గో సంరక్షణశాలను బీఆర్ నాయుడు సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. గోశాల మాజీ డైరెక్టర్‌ హరినాథ రెడ్డి అక్రమాలు అన్నీఇన్నీ కావని ఆరోపించారు. ఆయన బాగోతం బయటపడుతుందని రికార్డులు ఎత్తుకెళ్లారని విమర్శించారు. బీజేపీ నేత సుబ్రమణ్యస్వామికి గోశాలలో అన్యాయాలు కనిపించలేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులపై, పార్టీపై ఆయన ఎందుకు పిల్‌ వేయలేదని నిలదీశారు.

టీటీడీ అంటేనే ఒంటికాలిపై లేచే సుబ్రమణ్యస్వామి నిజానిజాలు ఏంటో తెలుసుకోరా? అని అడిగారు.  గోశాలలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేస్తామని బీఆర్ నాయుడు తెలిపారు. ఇక్కడ ఏం జరుగుతోందన్నది కమిటీ తేలుస్తుందని వెల్లడించారు. టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్‌ హరినాథరెడ్డిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news