శ్రీవారి భక్తులకు షాక్ ఇచ్చిన టీటీడీ

-

తిరుమల : శ్రీవారి భక్తులకు షాక్ ఇచ్చింది టీటీడీ. టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఇవాళ సమావేశం అయింది. ఈ సందర్భంగా టీటీడీ ఈఓ జవహార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పట్లో శ్రీవారి దర్శనాల సంఖ్యను పెంచబోమని.. కరోనా పరిస్తులు మెరుగుపడ్డాకే ఆలోచన చేస్తామన్నారు. తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా మార్చేందుకు 35 ఎలక్ట్రికల్ వాహనాలను డ్రైలీజ్ కు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని.. 2022 సంవత్సరానికి సంబంధించి త్రిదండి చినజీయర్ స్వామి ప్రతిపాదనలకు సంబంధించి 10 ఆలయాల పునరుద్ధరణకు శ్రీవాణి ట్రస్టు నుండి రూ.9 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

శ్రీవారి ట్రస్టుకు ఇప్పటి వరకు రూ.150 కోట్లు విరాళంగా అందిందని.. శ్రీవారి ట్రస్టు దర్శనాలకు వీఐపీ బ్రేక్ దర్శనాల్లో ప్రియారిటీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బర్డ్ ఆసుపత్రి పాత భవనంలో చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించి రూ.6 కోట్లతో క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయలని నిర్ణయం తీసుకున్నామని.. టీటీడీలో భద్రత మరింత పటిష్టం చేసేందుకు రూ.2 కోట్లతో మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. రూ.4.27 కోట్లతో 22 స్కానర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. శ్రీవారి నైవేధ్యానికి స్వచ్ఛమైన ప్రకృతాసిద్ధమైన నెయ్యిని వినియోగించాలని నిర్ణయించామని వెల్లడించారు. దీనికి సంబంధించి 25 గిర్ గోవులను విరాళంగా అందించారన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news