ప్రతిపక్షాలపై స్వరం పెంచిన కేటీఆర్.. కారణమేంటి?

తెలంగాణ రాజకీయాల్లో వాడి వేడి విమర్శలు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా ప్రతిపక్షాల మాటలపై కేటీఆర్ స్వరం పెంచారు. గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాటలనే వారికి ఇకపై ఊరుకోమని, వాళ్ళు ఒక్కటంటే మేం వంద అంటామని, బరాబర్ మాట్లాడతామని, ఇటుక విసిరితే తిరిగి రాయి వేసిరివేస్తామని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఇప్పటిదాకా మస్తు ఓపిక పట్టినం, ఇక చాలు. ఇప్పటి నుండి ఊరుకునేదే లేదని కామెంట్లు చేసారు.

సడెన్ గా కేటీఆర్ స్వరం పెంచడానికి కారణంమేంటనేది ఒక్కొక్కరూ ఒక్కో రకంగా విశ్లేషిస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిక విషయమే కేటీఆర్ దూకుడుకు కారణమా అని అనుకుంటున్నారు. ఇటువైపు మరికొందరేమో, ఉద్యమకాలం నాటి మాటలను మళ్ళీ మాట్లాడుతున్నారని, రాష్ట్రం సిద్ధించాక ప్రజలను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముందని ప్రతిపక్షాల నేతలు అంటున్నారు. మరి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలకు కారణం ఏంటనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుందేమో చూడాలి.