ఇన్నిరోజులు ఏపీ పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించని వంగవీటి రాధా సడన్‌గా…రాజకీయాల్లో ట్విస్ట్‌లు ఇస్తున్నారు. ఇటీవల గుడివాడ రాజకీయాల్లో వంగవీటి బాగా హల్చల్ చేస్తున్నట్లు కథనాలు వచ్చాయి. గుడివాడలో తమ సామాజికవర్గమైన కాపు నేతలతో వంగవీటి ఈ మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇదే క్రమంలో రాధా…గుడివాడ బరిలో రాధాని ఢీకొట్టేందుకు సిద్ధమయ్యారని వర్గాలు వచ్చాయి.
రాధా…టిడిపిలోనే ఉన్నారని నెక్స్ట్ ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలో దిగి…కొడాలికి చెక్ పెట్టనున్నారని, ఇది చంద్రబాబు వ్యూహామంటూ బాగా హడావిడి ప్రచారం జరిగింది. ఇలా ప్రచారం జరుగుతుండగానే రాధా రూట్‌లో మరొక ట్విస్ట్ వచ్చింది. తాజాగా గుడివాడలో ఓ ఫంక్షన్‌కు రాధా వెళ్లారు. ఆ ఫంక్షన్‌కు మంత్రి కొడాలి నాని కూడా వచ్చారు. ఇక ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా అక్కడే ఓ అతిథి గృహంలో రెండు గంటల పాటు సమావేశమయ్యారని, జగన్‌తో చర్చించి రాధాకు వైసీపీలో ప్రాధాన్యత కల్పించి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేలా ఒప్పిస్తానని మంత్రి కొడాలి నాని రాధాకు చెప్పినట్లు తెలిసింది. అటు గుడివాడలో ఉన్న రాధాకు సంబంధించిన వర్గం కూడా ఈ ప్రతిపాదనకు ఒప్పుకోవాలని రాధాపై ఒత్తిడి చేశారని కూడా తెలిసింది.
ఇక నాని నుంచి ఈ ప్రతిపాదన వచ్చిందని కథనాలు రాగానే, రాధా ఆ కథనాలని ఖండించారని, తాను ఫంక్షన్‌కు వెళ్లడాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని రాధా, తన అనుచరుల దగ్గర మాట్లాడినట్లు మరొక కథనం వచ్చింది. అసలు ఫంక్షన్‌లో రాధా, కొడాలితో అంటీముట్టనట్లుగా ఉన్నారని, వైసీపీ వాళ్లే కావాలని ప్రచారం చేస్తున్నారని టిడిపి అనుకూల మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు రాధా మనసులో మాత్రం ఏముందో ఎవరికీ క్లారిటీ రావడం లేదు. కానీ మీడియాలో మాత్రం అనేక కథనాలు వచ్చేస్తున్నాయి. అయితే అధికారికంగా రాధా చెప్పేవరకు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదనే చెప్పొచ్చు.