ట్విట‌ర్ పోల్ : రానున్న‌ది ప‌వ‌న్ ప్ర‌భుత్వం ! ఇది ఫిక్స్ ! భ‌య్యా !

-

ఇప్ప‌టిదాకా ప‌వ‌న్ సౌమ్యంగా ఉన్నారు
అంటే ఎవ‌రితోనూ పెద్ద‌గా విభేదాలు ఏమీ లేవు
కానీ ఇక‌పై ఆయ‌న ఆ విధంగా ఉండ‌రు ఉండ‌కూడ‌దు కూడా
ఫ‌క్తు పొలిటీషియ‌న్ ప‌వ‌న్ కావాలి
అప్పుడే వైసీపీకి చుక్క‌లు చూపించ‌డం సాధ్యం
వ‌రుస రెండు ఎన్నిక‌ల్లో ఏ పాటి ప్ర‌భావం చూపలేక‌పోయింద‌ని
అంటూనే వైసీపీ మాత్రం ఆయ‌న‌నే టార్గెట్ చేస్తుంది
అలాంట‌ప్పుడు రానున్న కాలంలో ఫైట్ ఎలా ఉండాలి ఎలా ఉండ‌బోతోంది
యుద్ధం షురూ అయితే గెలుపు మాత్రం ప‌వ‌న్ దే ప‌క్కా
కానీ రూ.కోట్లతో న‌డిచే లేదా న‌డిపే యుద్ధంలో
ప‌వ‌న్ కు గెలుపు సునాయాస‌మేనా అన్న‌ది కూడా ఓ డౌట్

జనసేన పార్టీని మార్చి 14 వ తేదీ, 2014 లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఏర్పాటు చేశారు.పార్టీ పెట్టిన మొదట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ…..పని చేస్తామని..తమకు రెండు రాష్ట్రాల క్షేమమే ముఖ్యమని అధినేత పవన్‌ కళ్యాణ్ ప్రకటించారు. కానీ.. క్రమేపీ జనసేన పార్టీ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాంతీయ పార్టీ గానే మిగిలిపోయింది. ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్రం పై… జనసేన పార్టీ ఫోకస్ చేయలేదు.కీలక నేతలు ఎవరూ కూడా తెలంగాణ జనసేన పార్టీలో చేరలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు.పార్టీ పెట్టిన ఐదు సంవత్సరాల తర్వాత అంటే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది జనసేన. అయితే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడమే కాకుండా… రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక సీటుకు పరిమితమైంది జనసేన.

ఆ గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా… జగన్ మాటే శాసనం అంటున్నాడు. దీంతో ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయలేక… జనసేన అధినేత సైలెంట్ అయ్యారు. ఇక 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కంటే ఎక్కువగా జనసేన… వైసీపీ సర్కార్ పై పోరాటాలు చేస్తోంది. ముఖ్యంగా ఏపి రోడ్ల పరిస్థితులపై… జనసేన పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు చాలా మేరకు సక్సెస్ అయ్యాయి. దీంతో సీఎం జగన్…వకీల్‌ సాబ్‌ సినిమా పై ఆంక్షలు విధించారు.

ఇక అక్కడితో ఆగకుండా… ఏపీ రాజధాని, అభివృద్ధి ఇలా అనేక అంశాల్లోనూ జగన్ సర్కారును జనసేన ప్రశ్నిస్తూనే ఉంది. అటు కేంద్ర పార్టీ నాయ బీజేపీతో పొత్తు ఉంటూనే… పోరాటాలు చేస్తోంది. అయితే… 2019 కంటే… ఇప్పడు..జనసేన పార్టీపై ఏపీ ప్రజలకు కాస్త నమ్మకం వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల లోపు మరిన్ని కార్యక్రమాలతో… జనాల్లోకి.. వెళితే.. జనసేన పార్టీకి మెరుగైన ఫలితాలు వస్తాయి. మంచి కార్యచరణతో… ముందుకు వెళ్లి… అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకోవాలి. అప్పుడే.. 2024 లో ఎక్కువ సీట్లు సాధించవచ్చు. మరి ఆ దిశగా జనసేన అడుగులు వేస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news