తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మర్చించేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహిస్తోంది. తాజాగా అసెంబ్లీ పామాయిల్ సాగుపై మంత్రి నిరంజన్ రెడ్డి కీలక ప్రకటన చేసింది. పామాయిల్ సాగుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 1100 ఎకరాల్లో ఆయిల్ పామ్ నర్సరీలను ఏర్పాటు చేశామని.. వానాకాలంలో 2.20 లక్షల ఎకరాలకు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. డ్రిప్ ఇరిగేషన్ పై కేంద్రం రూ. 6 వేల మాత్రమే ఇస్తోందని… రాష్ట్ర ప్రభుత్వం రూ. 14వేలకు పైగా భారం పడుతోందని ఆయన సభకు తెలిపారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఆయన వెల్లడించారు.
మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు నిమిత్తం 10 లక్షల 90 వేల ఎకరాలను అనుకూలమైనవిగా సూచించిదని.. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సూచించిన దాని కన్నా 20 లక్షల ఎకరాల్లో సాగును విస్తరించేందుకు ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ ఎక్ట్రాక్షన్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు.. రైతుల్లో చైతన్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు.