ముంబైలో దారుణం : భారీ వర్షం.. కుప్పకూలిన రెండు భవనాలు..!

-

ముంబైలో భారీ వర్షాలకు రెండు భవనాలు కుప్పకూలాయి. దక్షిణ ముంబైలోని ఓ ఆరు అంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. మరో ఘటనలో మాల్వానీ ప్రాంతంలో మూడు అంతస్తుల భవనంలో ఒక భాగం కూలింది. ఈ ఘటనలో శిధిలాల కింద కొందరు చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే శిథిలా నుంచి ఇద్దర్ని బయటికి తీసి ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. నాలుగు ఫైరింజన్లలో అగ్నిమాపక సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపడుతున్నారు.

కాగా వర్షాలకు భవనం కూలిన ప్రాంతాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే పరిశీలించారు. మంగళవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై నగరంలో పలు ప్రాంతాలు వరదనీటిమయమయ్యాయి. పాత భవనాలు కూలిపోతున్నాయి. కాగా, మరో 18 గంటలపాటు ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news